రాష్ట్రీయం

మానవాళికి పరిశోధనలు తోడ్పడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: ఆధునిక శాస్ర్తియ సాంకేతిక పరిజ్ఞానం మానవాళి అభ్యున్నతికి తోడ్పడాలని రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీత ఆచార్య కుర్టు ఊత్రిచ్ పేర్కొన్నారు. గత పక్షం రోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆయన హైదరాబాద్ నగరంలోని చారిత్రక ప్రదేశాలతో పాటు సిసిఎంబి సహా పలు పరిశోధనా సంస్థలను, విశ్వవిద్యాలయాలను సందర్శించా రు. బయో ఆసియా అంతర్జాతీయ సదస్సులో జీనోమ్ వ్యాలీ ఎక్స్‌లెన్స్ అవార్డును సైతం ఆయన అందుకున్నారు. శుక్రవారం ఆయన ఉస్మానియా యూనివర్శిటీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆంధ్రభూమితో మాట్లాడారు.
మీ గురించి చెబుతారా?
జవాబు: స్విట్జర్లాండ్ ఆర్‌బెర్గ్‌లో 1938, అక్టోబర్ 4న జన్మించాను. చిన్నతనం అంతా బెర్నర్ సీలెండ్‌లో జరిగిపోయింది. అప్పట్లో ఆ ప్రాంతం అంతా ఒక చిన్న పట్టణం. చుట్టూ పంట భూములు, అడవి, నదులు. మా పూర్వీకులు అంతా పర్వతప్రాంతాల్లోనే జీవించారు. మా అమ్మ వాళ్ల కుటుంబం చిన్న హోటల్ నడిపేది. మా తాతగారి కుటుంబం అంతా నదిలో చేపలుపట్టేవారు. మా నాన్న పేరు హెర్మన్ ఊత్రిచ్. ఆయన అకౌంటెంట్‌గా పనిచేసేవారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ప్రకృతితో, జీవశాస్త్రాలతో అప్పుడే నేను మమేకం అయ్యాను. బెర్ను యూనివర్శిటీలో మాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో స్నాతకోత్తర చదువు పూర్తయింది. బసెల్ యూనివర్శిటీలో ప్రసిద్ధ ప్రొఫెసర్ సిల్వియో ఫాలబ్ నేతృత్వంలో పిహెచ్‌డి పూర్తయింది.
నోబెల్ పురస్కారం ఎందుకు వచ్చింది?
జవాబు: న్యూక్లియర్ మాగ్నటిక్ రిజనెన్స్ (ఎన్‌ఎంఆర్)కు వచ్చింది. ఎన్‌ఎంఆర్‌పై చేసిన పరిశోధనల ఫలితాలు ఎంఆర్‌ఐ స్కానింగ్‌కు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. ఈనాటి ఆరోగ్య అవసరాలకు నా పరిశోధన ఎంతగానో సహాయకారి అయ్యింది. మానవాళి జీవనానికి తోడ్పడే పరిశోధనే నిజమైన పరిశోధన అని నా అభిప్రాయం.
ఇంత ఉత్సాహంగా ఎలా ఉండగలుగుతున్నారు?
జవాబు: నోబెల్ గ్రహీతలు కూడా మామూలు మనుషులే. ఆకాశం నుండి ఊడిపడలేదు. ప్రకృతితో దగ్గరగా ప్రయాణం చేసినపుడే నూతన శాస్ర్తియ పరిశోధనలు చేయగలుగుతాం. జీవితంలో అరణ్యంలో తిరుగాడుతూ, చేపలు పడుతూ, శారీరక దృఢత్వాన్ని సాధించే విన్యాసాలు చేస్తూ, మంచు పర్వతాలపై పరిగెడుతూ, ప్రకృతి మాత ఒడిలో ఉత్సాహంగా గడిచింది.శాస్ర్తియ ఆవిష్కరణలకు ప్రకృతి మాత ఒడియే ప్రథమ మూలం. అలా మమేకం కావడం వల్లనే ఉత్సాహం ఉంటుంది.
ప్రస్తుత పరిశోధనలు ఎలా ఉన్నాయి?
జవాబు: నూతన పరిశోధనలు సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్నాయి. కాని పరిశోధన ఫలాలు వినియోగించేవారికి చేరడానికి, ఉపయుక్తం కావల్సిన వారికి చేరడానికి చాలా వ్యవధి పడుతోంది.