రాష్ట్రీయం

లింగ వివక్షలేని సమాజం కోసం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 11: లింగ వివక్ష లేని సమ సమాజ స్థాపన కోసం అందరం కలిసి కృషి చేద్దామని తెలంగాణ స్పీకర్ వి మధుసూదనాచారి పిలుపునిచ్చారు. ప్రపంచంలోని పలు దేశాల్లో మహిళలు రాజ్యాంగ పాలకులుగా ఉన్నప్పటికీ వారిలో అత్యధిక మంది ఇతరుల కనుసన్నల్లో నడుస్తున్నారనేది కూడా గుర్తించాలంటూ, వారికి ఎప్పుడైతే స్వయం ప్రతిపత్తి కల్పిస్తామో అప్పుడే వారు అన్ని రంగాల్లో నిర్ణయాత్మక శక్తిగా మారగలరని అన్నారు. జాతీయ మహిళా సదస్సులో రెండోరోజు శనివారం ఆయన మాట్లాడుతూ దేశంలో ఒక్క కేరళలోనే మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతుండటం కన్పిస్తుందంటూ మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఆ విధంగా వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి అంశాలన్నింటినీ సమూలంగా చర్చించి మహిళను ఓ శక్తిగా వినియోగించుకోటానికి ఈ సదస్సు ఓ కార్యాచరణ వేదిక కావాలన్నారు. అన్ని రకాల ఆటుపోట్లను అధిగమించి మహిళల శక్తిసామర్థ్యాలు, సమర్థతను వినియోగించుకున్నప్పుడే దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే వారు ఉన్నతస్థాయికి చేరుకోగలరని అన్నారు. అయితే కారణాలేమైనా ఇప్పటికీ మహిళలు దాదాపు అన్ని రంగాల్లో వెనుకబడే ఉన్నారని అన్నారు. అందుకే వారిని నిర్ణయాత్మక శక్తిగా తీర్చిదిద్దాల్సి ఉందన్నారు. వారిని వ్యక్తులుగా చూస్తూ అవసరమైన సందర్భాల్లో వినియోగించుకోటం కాదు.. ఓ శక్తిగా ఆ సమూహాన్ని వినియోగించుకోవాల్సి ఉందన్నారు. మహిళ సృష్టికర్త, కన్నతల్లి.. ఆ తర్వాత సోదరి అన్న భావన కలుగాలంటూ వారిని వౌన ప్రేక్షకులుగా మార్చవద్దన్నారు. ఈ రాష్ట్రం, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని రంగాల్లోనూ వారి భాగస్వామ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. స్పీకర్ మధుసూదనాచారితో పాటు ఆయన వెంట వచ్చిన తెలంగాణ మండలి చైర్మన్ స్వామిగౌడ్‌ను సిఎం చంద్రబాబునాయుడు, గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ కల్సి ఘనంగా సత్కరించారు.

చిత్రం..మహిళా పార్లమెంట్‌లో ప్రసంగిస్తున్న తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి