తెలంగాణ

అకస్మాత్తుగా గేట్‌వాల్ తెరిచారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చొప్పదండి/గంగాధర, ఫిబ్రవరి 11: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం సర్వారెడ్డిపల్లి వద్ద ఎల్లంపల్లి ప్రాజెక్టు పైపులైనుకు గేట్ వాల్ తెరవడంతో దాదాపు 40 ఎకరాల పంట పొలాలు పూర్తిగా నీటి మునిగిపోయాయి. చెరువులు నింపేందుకు ఎల్లంపల్లి ప్రాజెక్టు పైపులైనుకు అక్కడక్కడ గేట్‌వాల్‌లు ఏర్పాటు చేశారు. అయితే, ఇంతకుముందే గుండి చెరువుకు వచ్చే గేట్‌వాల్ తీయగా చెరువు పూర్తిగా నిండింది. దీంతో అధికారుల ఆదేశాల మేరకు రైతులు పంట పొలాలు వేసుకున్నారు. పంట పొలాలు పచ్చదనంతో ఉన్నాయన్న సంతోషం గేట్‌వాల్ తీయడంతో ఆగిపోయింది. నీటి ప్రవాహం ఎక్కవ కావడంతో సామర్థ్యం కంటే ఎక్కువ నీరు రావడంతో పెద్ద మొత్తంలో సర్వారెడ్డిపల్లికి చెందిన దుబ్బాసి పుర్స నర్సయ్య, పైండ్ల నర్సయ్య, కరబూజ కొమురయ్య, దుబ్బాసి పోచయ్య, దుబ్బాసి లస్మయ్య, పైండ్ల మల్లేశంతోపాటు పలువురు రైతులకు చెందిన 40 ఎకరాలకుపైగా పంట నీట మునిగిపోయింది. తక్షణం జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని పంటలను పరిశీలించి నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.
నేడు జాతీయ సామాజిక
మీడియా ఫిలిం ఫెస్టివల్
వివిధ ప్రాంతాల నుంచి 22 వరకు ఎంట్రీల రాక
జహీరాబాద్, ఫిబ్రవరి 11: దేశంలోనే మొట్టమొదటి జాతీయ కమ్యూనిటీ మీడియా ఫిలిం ఫెస్టివల్‌ను సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలోని కెవికెలో ఆదివారం నిర్వహించనున్నట్లు డిడిఎస్ డైరెక్టర్ పి.వి.సతీష్ తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇక్కడి పస్తాపూర్ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోని మొదటి కమ్యూనిటీ ఫెస్టివెల్‌కు అనేక చిత్రాలు వివిధ ప్రాంతాల నుంచి 22 వరకు వచ్చాయన్నారు. ప్రధానంగా గోవా నుంచి వీడియో వలంటీర్లకు చెందినవి 4 చిత్రాలు, నార్త్ ఈస్ట్ నెట్‌వర్క్ నాగాలాండ్, వ్యవసాయ శాఖ డిజిటల్ గ్రీన్ సంస్థనుంచి, చత్తీస్‌గఢ్‌కు చెందిన సంగ్వారి ఖబరియా సంస్థ, ఆంధ్రప్రదేశ్ నుంచి 8 ఎంట్రీలు వచ్చాయన్నారు. సామాజిక మీడియాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకుని వచ్చిన భారత టెలివిజన్ ప్రొఫెషనల్, డిడిఎస్ మహిళలు చేస్తున్న కృషిని మొదట గుర్తించి స్థానిక మహిళలకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపునకు కారణమైన జై చందీరామ్ స్మారకంగా ఈ ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు చెప్పా రు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హైదరాబాద్ యూనివర్సిటీకి చెందిన యునెస్కో చైర్మన్ ప్రొఫెసర్ వినోద్‌పావురాల, ఢిల్లీకి చెందిన సీనియర్ జర్నలిస్ట్ లతా గిస్నుతోపాటు వెస్ట్ ఆఫ్రికా, కెనడాల నుంచి మరో ఆరుగురు అతిథులు హాజరవుతున్నారన్నారు.