రాష్ట్రీయం

రిజర్వేషన్లతోనే సాధికారత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 12: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను గౌరవపూర్వకంగా ఇవ్వాల్సిన సమయం ఆసన్నమయిందని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. విజయవాడ పవిత్ర సంగమం వద్ద నిర్వహిస్తున్న జాతీయ మహిళా పార్లమెంట్ ముగింపు సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 33 శాతం రిజర్వేషన్‌తో సాధికారత సాధ్యమని, ఇది దేశాభివృద్ధికి ఊతంగా భావించాలనీ అన్నారు. రిజర్వేషన్ మహిళలకు పురుషులు ఇస్తున్నది కాదన్నారు. జనాభాలో సగం మంది మహిళలని, కానీ రిజర్వేషన్ అంశంపై పార్లమెంట్‌లో వ్యతిరేకిస్తూ పేపర్లు చింపడం, విభేదించడం వంటివి చోటుచేసుకుంటున్నాయన్నారు. మహిళలకు రిజర్వేషన్‌ను గౌరవపూర్వకంగా ఇవ్వాల్సి ఉందన్నారు. మహిళలు, పురుషులు కలిసి పని చేయాలని, మహిళా సాధికారత అన్న అంశాన్ని జాతి నిర్మాణ అంశంగా పరిగణించాలన్నారు. అమరావతి నిర్మాణానికి రైతులు భూములు ఇవ్వడం కొత్త విషయమన్నారు. తాము గతంలో మహిళా పార్లమెంటేరియన్ల, బ్రిక్స్ దేశాల మహిళా ప్రతినిధుల సదస్సులు నిర్వహించామని, అవి 2జి, 3జి లాంటివని సుమిత్రా మహాజన్ అభివర్ణించారు. విజయవాడ సదస్సులో విద్యార్థినులను భాగస్వాములను చేసి 4జి, 5జి చేశారంటూ చమత్కరించారు. నేటి మహిళలకు అవగాహన, ఓర్పు వంటి మంచి లక్షణాలు ఉన్నాయని, ఏ పదవిలోనైనా వారు రాణించగలరని ఆమె అన్నారు.

చిత్రం..జాతీయ మహిళా పార్లమెంటు ముగింపు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, తదితరులు