రాష్ట్రీయం

అణు విద్యుత్‌ప్లాంట్ సందర్శించిన పవన్‌కళ్యాణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: అమెరికాలో అణువిద్యుత్ ప్లాంట్‌ను సినీ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సందర్శించారు. అమెరికాలోని న్యూహాంప్‌షైర్ రాష్ట్రంలో సముద్రం ఒడ్డున నిర్మించిన సీబ్రూక్ అటామిక్ పవర్ ప్లాంట్‌ను సందర్శించి, అక్కడి శాస్తవ్రేత్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా అణువిచ్ఛితి, తద్వారా జరిగే విద్యుత్ ఉత్పత్తిని నిపుణులు వివరించారు. అనంతరం కాంకర్డ్ స్టేట్ హౌస్‌లో పవన్ కళ్యాణ్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారని జనసేన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. న్యూహాంప్‌షైర్ రాష్ట్రంలో ఒకప్పుడు పది నూక్లియర్ ప్లాంట్లు ఉండేవని ప్రజా శ్రేయ స్సు దృష్ట్యా వాటిలో ఏడు ప్లాంట్లను మూసివేశామని వక్తలు తెలిపారు. ఈ సమావేశంలో సీబ్రూక్ నూక్లియర్ ఫెసిలిటీ డైరక్టర్ మేఘన్ లీ హై, నూక్లియర్ ఫెసిలిటీ జనరల్ మేనేజర్ గ్రిఫిత్ అలెన్, న్యూహాంప్‌షైర్ ప్రతినిధిలం మంగిపూడి, అమెరికన్ కాంగ్రెస్ మాజీ సభ్యుడు పాల్ హోడ్స్, స్టేట్ రిప్రజెంటేటివ్ కరెన్ అబెల్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో తలపెట్టిన రెండు అణువిద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపధ్యంలో అమెరికాలో అణువిద్యుత్ కేంద్రాన్ని పవన్‌కళ్యాణ్ సందర్శించారు. అణువిద్యుత్‌పై ఉన్న సందేహాలను ఈ సందర్భంగా పవన్ అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఈ ప్లాంట్ నిర్మించేందుకు సన్నాహాలు ఇప్పటికే జరుగుతున్న సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ సాంకేతిక సహాయంతో ఎన్‌పిసిఐఎల్ సంస్థ ఎపి 1000 రియాక్టర్‌ను ఏర్పాటు చేస్తోంది.
తద్వారా 6,600 మెగావాట్ల సామర్ధ్యంతో ప్లాంటును అం దుబాటులోకి తెచ్చేందుకు పనులు నిశ్శబ్ధంగా జరిగిపోతున్నాయి. నెల్లూరు జిల్లాలోని కావలి తీర గ్రామాలైన రుద్రకోట, చెన్నాయపాలెం మధ్య రష్యా సాంకేతిక పరిజ్ఞానంతో మరో 6000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదక సామర్ధ్యంతో కూడిన ప్లాంటును ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో పవన్ అణువిద్యుత్ ప్లాంట్‌ను సందర్శించారని జనసేన కార్యాలయం తెలిపింది.
ఎంపి కవితకు కృతజ్ఞతలు తెలిపిన పవన్
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై నిజామాబాద్ ఎంపి కె.కవిత మద్దతు ప్రకటించినందుకు సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. జాతీ య మహిళా పార్లమెంటు సదస్సు సందర్భంగా కవిత ప్రత్యేక హోదాకు మద్దతు ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ఇరు రాష్ట్రాలు సమన్వయంతో కలిసి పని చేసుకోవాలని అన్నారు. కలిసి పని చేస్తే నిలబడతాం, విడిపో యి పని చేస్తే పడిపోతామని ట్విట్టర్‌లో స్పందించారు.