రాష్ట్రీయం

వీరాపురానికి విదేశీ విహంగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలమత్తూరు, ఫిబ్రవరి 12 : అనంతపురం జిల్లా చిలమత్తూరు మండల పరిధిలోని వీరాపురం గ్రామానికి గత రెండు రోజులుగా విదేశీ విహంగాలు (సైబీరియన్ పక్షులు) చేరుతున్నాయి. సైబీరియన్ పక్షులు మొదట కొన్ని మాత్రమే వీరాపురం చేరుకుని చుట్టు పక్కల ఉన్న చెరువులను సందర్శించి అనువుగా ఉన్నట్లయితే తరువాత వేల సంఖ్యలో తరలి రావడం గత 30 ఏళ్లుగా జరుగుతోంది. ఎన్నో ఏళ్ల నుంచి ఈ పక్షులు సంతానోత్పత్తి కోసం ఇక్కడికి వచ్చి 6 నెలల తర్వాత తమ సంతానంతో తిరిగి వెళ్తున్న విషయం తెలిసిందే. అయితే గత మూడేళ్లుగా చిలమత్తూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో నీరు లేకపోవడండో పక్షులు తక్కువ సంఖ్యలో వచ్చి వెళ్తున్నాయి. ఈ ఏడాది కూడా ఈ ప్రాంతంలో అనావృష్ఠి పరిస్థితులు నెలకొనడంతో విదేశీ పక్షులు వస్తాయో, రావో అనే అనుమానం తలెత్తుతున్న సమయంలో గత రెండు రోజులుగా విదేశీ అతిథులు రావడంతో ఈ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే పాల సముద్రం చెరువులో తప్ప మరెక్కడా చెరువుల్లో నీరు లభించని పరిస్థితి ఏర్పడింది. దీంతో సైబీరియన్ పక్షులు ఈ ఏడాది ఇక్కడే ఉంటాయా, వెనుదిరిగి వెళ్తాయా అనే సందేహం వ్యక్తమవుతోంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హంద్రీనీవా పనులు పూర్తి చేసి చెరువులకు నీరు వదిలితే రైతులతో పాటు రైతు మిత్రులైన సైబీరియన్ పక్షులు ఈ ప్రాంతానికి అధిక సంఖ్యలో వచ్చే వీలు ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.