రాష్ట్రీయం

రాఘవేంద్రరావుకు ‘అల్లు’ జాతీయ పురస్కారం ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 6: ప్రముఖ హాస్యనటుడు స్వర్గీయ అల్లురామలింగయ్య పేరిట ఏటాఇచ్చే ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాన్ని ఈఏడాది ప్రఖ్యాత దర్శకుడు కె.రాఘవేంద్రరావుకు ప్రదానం చేశారు. నగరంలోని సత్యసాయి నిగమాగమంలో బుధవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఆయనను సత్కరించారు. అల్లురామలింగయ్య కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన పురస్కార ప్రదానోత్సవాన్ని నటుడు, కాంగ్రెస్ నేత చిరంజీవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఏపి రాష్టమ్రంత్రులు కామినేని శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావుసహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సినీరంగానికి రాఘవేంద్రరావు చేసిన సేవలను కొనియాడిన కళాపీఠం నిర్వాహకులు ఆయనను దుశ్శాలువ కప్పి సత్కరించారు. అనంతరం స్వర్ణకిరీటాన్ని ప్రదానం చేశారు. అల్లు రామలింగయ్య కుటుంబ సభ్యులు అరవింద్, అర్జున్, శిరీష్ సహా సినీ ప్రముఖులు పరుచూరి వెంకటేశ్వరరావు, నిర్మాత అశ్వినీదత్, సర్దార్‌గబ్బర్‌సింగ్ నిర్మాత మరాత్‌సహా పలువురు పాల్గొన్న ఈ కార్యక్రమం మెగాఫ్యామిలీ అభిమానులను అలరించింది.

హైదరాబాద్‌లోని సత్యసాయి నిగమాగమంలో బుధవారం
రాత్రి జరిగిన అల్లు రామలింగయ్య జాతీయ పురస్కార కార్యక్రమంలో దర్శకుడు రాఘవేంద్రరావుకు స్వర్ణ కిరీటాన్ని అలంకరిస్తున్న అల్లు అరవింద్, చిరంజీవి. చిత్రంలో ఏపి మంత్రులు గంటా, కామినేని, అల్లు శిరీష్ ఉన్నారు.