రాష్ట్రీయం

కథల పరిశోధనాకేంద్రంగా ‘కథానిలయం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 12: అనేక విశ్వవిద్యాలయాలు కలిసి చేయాల్సిన అత్యుత్తమమైన కథల పరిశోధనను ఆంధ్రప్రదేశ్‌లో చిట్టచివరి జిల్లాయైన శ్రీకాకుళం నుంచి కథానిలయం చేస్తోందని ప్రముఖ సాహిత్య వేత్త, కథానిలయం వ్యవస్థాపకులు కాళీపట్నం రామారావు(కారా మాష్టారు) అన్నారు. పరిశోధక అధ్యాపకులకు, విద్యార్థులకు భవిష్యత్‌లో పలు పరిశోధనలు చేసే కర్మాగారంగా ‘కథానిలయం’ ఎదిగిందని, ఈ ఏడాది ఆరుగురు పరిశోధక విద్యార్థులు కథానిలయం సేవలు పొందారని చెప్పడానికి గర్విస్తున్నామని ఆయన పేర్కొన్నారు. లెక్చరర్లు, రచయితలు, పబ్లిషర్లు, పరిశోధనలు ఇక్కడ నుంచే ఆరంభించారని, . ఇరవై ఏళ్ళు కిందట చిన్నపాటి కథలు దాచుకునే గూడు.. ఇప్పుడు కథలు, సాహిత్యంపై పరిశోధనలు చేసే గ్రంథాలయంగా ఎదిగిందంటూ ఆయన వివరించారు. ఇంతటి మహా అక్షర యజ్ఞాన్ని తాను ఒక్కడినే చేయలేదని, సమాజ రుణం తీర్చుకునేందుకు అక్షరానికి కాపాలాగా తాను రెండు దశాబ్దాలుగా ఉంటే..దానికి దేశ, విదేశాల్లోని తన శిష్యులు సహకరించారని, వారందరీ సంకల్పమే ఈ ‘కథల-నిలయం’ అంటూ మాట్లాడారు. ఆదివారం ఇక్కడ ప్రభుత్వం మహిళా కళాశాల ఆడిటోరియంలో జరిగిన కథానిలయం 20వ వార్షికోత్సవ సభలో మాస్టారు కథానిలయం ప్రారంభ దశ నుంచి నేటి వరకూ చవిచూసే కష్టనష్టాలు, సంకల్పబలంతో సాధించిన విజయాలు వివరించారు. 800 గ్రంథాలతో ఆవిర్భవించిన కథానిలయంలో నేడు అనేక గ్రంథాలతో నిండిందన్నారు.
రెండంతస్తుల భవనంలో పురాణాలతోపాటు, సమావేశ మందిరం, ఇందులో రచయితలు, రచయిత్రుల ఫోటో గ్యాలరీ కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని తెలిపారు. 35 ఏళ్ళుగా 12,001 పత్రికలు కథానిలయంలో లభిస్తాయని పేర్కొన్నారు. అలాగే 15,076 మంది రచయితలు, రచయిత్రుల పేర్లు నమోదు చేసుకుని వారు రచించిన పుస్తకాలు కథానిలయానికి పంపడం ఆనవాయితీగా చెప్పుకొచ్చారు. 6,875 భౌతికంగా నమోదైన పుస్తకాలతోపాటు, సీడీల రూపంలో, డిజిటల్ రూపంలో గల పుస్తకాలు మరో 3,200 ఉన్నాయని వివరించారు. ఇప్పటి వరకూ కథానిలయంలో నమోదైన 89,700 కథలల్లో 90 శాతం డిజిటిలైజేషన్ పూర్తికాగా, మరో పది శాతం ఫోటోషాపింగ్, వెబ్‌సైట్‌లో అప్‌లోడింగ్ వంటి సాంకేతిక కారణాలతో మిగిలివుందని చెప్పారు. పూర్తిస్థాయిలో మరో ఒకటిరెండు సంవత్సరాలకు కథానిలయం ప్రపంచదేశాల్లో ఎక్కడనుంచి అయినా రచయితుల పేర్లును మీటనొక్కితే, వారి రచించిన కథలు, సాహిత్యం, పుస్తకాల జాబితా అంతా అంతర్జాలంలో చూసుకుంటూ చదువుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్‌లో చిట్టచివరి జిల్లాయైన శ్రీకాకుళం నుంచి ఏర్పాటు చేస్తామని తెలిపారు. డేటాబేస్‌లోకి వెళ్ళి కథలు క్లిక్ చేస్తే కన్పించే 89,700 కథల జాబితాలోంచి 28,602 కథలు కథారూపంలో చూసే అవకాశం ఇప్పటికే అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ ఏడాదిలో మరో 25,000 కథలు అదే రూపంలోకి తేవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కథానిలయం.కాం అనే వెబ్‌సైట్‌తో ప్రపంచంలో ఏ దేశం నుంచైనా తెలుగు కథలు చదువుకునే అవకాశం పుస్తకపాఠకులకు అందజేశామని ఆనందం వ్యక్తం చేశారు. 15,076 రచయితల్లో మూడు వేల మంది రచయితల వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచడానికి ప్రస్తుతం అవకాశం ఉందని, అందులో 700 మంది వివరాలు ఇప్పటికే పొందుపరిచామన్నారు.
సరికొత్త ప్రయోగంగా ‘దిద్దుబాటలు’ పుస్తక ప్రచురణ చేసి వెబ్‌సైట్‌లో పొందుపర్చడమని, అనేక విశ్వవిద్యాలయాలు కలిస్తేకాని చేయలేని ఈ ప్రక్రియను కథానిలయం చేయడం పట్ల తన జీవితాశయం వైపు అడుగులు వేశానంటూ కారా మాస్టారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం, కథానిలయం అధ్యక్షుడు బి.వి.రామరావు, కార్యదర్శి దాసరి రామచంద్రరావు, సాహితీవేత్త, కథలకు కథానాయకుడు శ్రీవిరించి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..కథానిలయం వార్షికోత్సవ సభలో మాట్లాడుతున్న కాళీపట్నం రామారావు