రాష్ట్రీయం

రెండునెలల గడువు కోరతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: ఉభయ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ వివాదంపై అధ్యయన నివేదిక ఇచ్చేందుకు కేంద్రాన్ని మరో రెండు నెలల గడువు కోరనున్నట్టు నిపుణుల కమిటీ చైర్మన్ బజాజ్ స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో తెలంగాణ అధికారులతో సమావేశమై రాష్ట్రం వాదనలు విన్నారు. అనంతరం చైర్మన్ బజాజ్ మీడియాతో మాట్లాడుతూ మంగళవారం ఆంధ్రప్రదేశ్ వాదనలు విన్న తరువాత బుధవారం రెండు రాష్ట్రాల అధికారులతో సంయుక్తంగా సమావేశం అవుతామన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలాల పంపిణీ వివాదంపై గత జనవరి 7న బజాజ్ కమిటీని నియమించిన కేంద్రం, మూడు నెలల్లో పరిష్కార సిఫార్సుల నివేదిక ఇవ్వాలని గడువు విధించడం తెలిసిందే. అయతే, రెండు రాష్ట్రాలమధ్య జలాల కేటాయింపుల నిష్పత్తిని మారుస్తున్నారా? అన్న మీడియా ప్రశ్నకు సమాధానంగా అది అపోహ మాత్రమేనన్నారు. అలాంటి అధికారాలు ట్రిబ్యునల్‌కే ఉంటాయని బజాజ్ స్పష్టం చేశారు.