రాష్ట్రీయం

దేవాదుల ప్రాజెక్టు సామర్థ్యం పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: దేవాదుల ప్రాజెక్టు (జె చొక్కారావు ఎత్తిపోతల పథకం) సామర్థ్యం పెంచడం వల్ల పెరుగనున్న నిర్మాణ అంచనా వ్యయాన్ని రూ.9427 కోట్ల నుంచి రూ.13,444.44 కోట్లకు పెంచారు. దేవాదుల ప్రాజెక్టు పెరిగిన వ్యయానికి పరిపాలనా అనుమతులను ఇస్తూ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా కంతనపల్లి వద్ద నిర్మించతలపెట్టిన బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదనను విరమించుకొని, తుపాకులగూడెం వద్ద నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తుపాకులగూడెం వద్ద నిర్మించబోయే బ్యారేజికి రూ.2121 కోట్ల అంచనాకు పరిపాలనా అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో దేవాదుల ప్రాజెక్టు సామర్ధ్యం 38.16 టిఎంసిల నుంచి 60 టిఎంసిలకు పెరుగనుంది. దీంతో దేవాదుల ప్రాజెక్టు నిర్మాణానికి గతంలో వేసిన ఎస్‌ఎస్‌ఆర్ రేట్లు పెంచడంతో అంచనా వ్యయం రూ.9427 కోట్ల నుంచి రూ.13,445.27 కోట్లకు పెరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టుకు మొదట రూ.6016 కోట్లకు, తర్వాత అంచనా వ్యయాన్ని రూ.9427.73 కోట్లకు పెంచింది. తాజాగా దేవాదుల ప్రాజెక్టులో భాగంగా తుపాకులగూడెం వద్ద నిర్మించబోయే బ్యారేజీకి రూ.2121 కోట్లు కేటాయించడంతో దేవాదుల ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.13,445.44 కోట్లకు చేరింది. కంతనపల్లి కంటే తుపాకులగూడెం వద్ద బ్యారేజీ నిర్మాణం వల్ల ఏడాదిలో 300 రోజులపాటు నీటి లభ్యత ఉంటుందని గుర్తించింది. శ్రీరామ్‌సాగర్ రెండో దశకు మొదట రూ.1043 అంచన వ్యయానికి పరిపాలనా అనుమతి ఇవ్వగా తాజాగా రూ.1220 కోట్ల అంచనాగా సవరించింది. దీనికి అదనంగా కొత్తగా చేపట్టబోయే పనులకు రూ.82 కోట్లు కలిపి దీని వ్యయం రూ.1303 కోట్లకు పరిపాలనా అనుమతి ఇచ్చినట్టు నీటిపారుదలశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.