రాష్ట్రీయం

విరాళాలు ఐచ్ఛికమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జనవరి 6: నూతన రాజధాని నిర్మాణంలో అందరినీ భాగస్వాములను చేయాలన్నది ప్రభుత్వ అభిమతమని, ఇందులో భాగంగానే విద్యార్థులు ఇష్టపడి తమవంతుగా రూ.10లు విరాళమివ్వాలని రాష్ట్ర మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కడప జిల్లా పర్యటన సందర్భంగా బుధవారం ప్రభుత్వం తరపున ఈ మేరకు సర్క్యులర్‌ను జారీ చేశారు. ఈ విషయంలో ఎవరినీ బలవంతపెట్టవద్దని, స్వచ్చందంగా మాత్రమే రూ.10లు ఇచ్చి నూతన రాజధాని నిర్మాణానికి తోడ్పాటు అందించాలని కోరారు. విద్యార్థులకు తాము సైతం రాజధాని నిర్మాణంలో భాగస్వాములం అయ్యామన్న ఆత్మతృప్తి ఉంటుందని పేర్కొన్నారు. అయితే విద్యాసంస్థల యాజమాన్యాలు, అధ్యాపకులు , ఉపాధ్యాయులు, విద్యార్థులపై వత్తిడి చేయవద్దని, ఇష్టపూర్వకంగా ఇస్తే మాత్రమే తీసుకోవాలని స్పష్టంచేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సహకారాన్ని అందించాలని మంత్రి విజ్ఞప్తిచేశారు.

ముంబయి-కాజిపేట
రైలు 11న ప్రారంభం

హైదరాబాద్, జనవరి 6: ఈ నెల 11న ముంబయి-కాజిపేట మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం అవుతుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆ రోజు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ జి.అహిర్ న్యూఢిల్లీలోని రైల్ భవన్‌లో వీడియోకానె్ఫరెన్స్ ద్వారా ఉదయం 11.30 గంటలకు కొత్త రైలును ప్రారంభిస్తారని తెలిపింది. లోకమాన్య తిలక్-కాజిపేట-లోకమాన్య తిలక్ మధ్య తిరిగే ఈ రైలుకు అనంద్వాన్ అనే పేరు పెట్టినట్లు రైల్వే తెలిపింది. ప్రతి వారంలో సోమవారం నాడు లోకమాన్యతిలక్ టెర్మినస్ నుంచి బయలుదేరుతుందని, తిరుగు ప్రయాణంలో ప్రతి మంగళవారం కాజిపేట నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు.
డబుల్‌డెకర్ రైళ్లలో అందుబాటులో సీట్లు
కాచిగూడ-గుంటూరు మధ్య ఈ నెల 8 నుంచి 17 వరకు నడిచే ప్రత్యేక డబుల్‌డెకర్ రైళ్లలో భారీగా సీట్లు అందుబాటులో ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ డబుల్ డెకర్ రైళ్లలో రిజర్వేషన్ సీట్లు అందుబాటులో ఉన్నాయని, ప్రయాణీకులు వినియోగించుకోవాలని తెలిపారు.