రాష్ట్రీయం

బిజెపికే విశాఖ ఎమ్మెల్సీ సీటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 14:్భరతీయ జనతా పార్టీ ఎట్టకేలకు అనుకున్నది సాధించింది. మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా విశాఖ పట్ట్భద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకుంది. ఇందుకోసం పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా జోక్యం చేసుకోవలసి వచ్చింది. ముందు కడప ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని ఆఫర్ చేసిన తెదేపా సూచనను అంగీకరిస్తూనే, దానితోపాటు విశాఖ పట్ట్భద్రుల స్థానం తమకు విడిచిపెట్టాలని షరతు విధించింది. దానిపై ముందు తెదేపా తర్జనభర్జన పడింది. ఈ వ్యవహారాన్ని కేంద్రమంత్రి సుజనాచౌదరి పర్యవేక్షించారు. బలం లేని కడప టీచరు సీటులో సాధించేది ఏమీ లేదని, తాము 45 వేల పట్ట్భద్ర ఓటర్లను ముందుగానే నమోదు చేయించినందున, విశాఖ పట్ట్భద్రుల స్థానం ఇవ్వాలని బిజెపి వాదించింది. చివరకు విశాఖ సీటును బిజెపికే ఇవ్వాలని తెదేపా నిర్ణయించింది. మంగళవారం జరిగిన తెదేపా సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు ఈ నిర్ణయం వెల్లడించారు. కాగా, కడప ఉపాధ్యాయ నియోజకవర్గం అభ్యర్ధిగా బరిలో ఉన్న ఒంటేరు శ్రీనివాసులురెడ్డిని బరి నుంచి తప్పుకోవాలని బిజెపి నాయకత్వం ఆదేశించగా, అందుకాయన ససేమిరా అన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. బిజెపి అగ్రనేతకు అనుచరుడిగా ముద్ర పడిన ఆయన బరి నుంచి తప్పుకోకపోతే ఆ అగ్రనేత ఇరుకున పడటం ఖాయమంటున్నారు. ఇదిలాఉండగా, బుధవారం విజయవాడలో జరగనున్న బిజెపి కోర్‌కమిటీ సమావేశంలో విశాఖ పట్ట్భద్రుల స్థానానికి అభ్యర్థి పేరును ప్రకటించనున్నారు. మాజీ ఎమ్మెల్సీ పివి చలపతిరావు తనయుడైన పివిఎన్ మాధవ్‌కు టికెట్ ఇవ్వనున్నారు. స్థానిక
సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయంపై బుధవారం జరిగే కోర్ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా యడ్ల ఆదిరాజు, ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా అజ శర్మ, ఇండిపెండెంట్ అభ్యర్థిగా వివి రమణమూర్తి పోటీ చేస్తున్నారు.