రాష్ట్రీయం

జీవనోపాధి కోల్పోతే భారీ పరిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: భూసేకరణ వల్ల భూమి కోల్పోయే వారికే కాకుండా వాటిపై ఆధారపడి జీవనోపాధి కోల్పోయే వారికి నష్టపరిహారం చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విధి విధానాలను మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు రెవిన్యూ శాఖ జీవో 38 జారీ చేసింది. భూసేకరణ వల్ల భూమి కోల్పోయే యజమానులకు మాత్రమే నష్ట పరిహారం చెల్లించడానికి విధివిధానాలు ఉన్నాయే తప్ప సదరు భూమిపై ఆధారపడి జీవనం సాగించే వారికి పరిహారం చెల్లించడం లేదని జీవో 123పై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భూసేకరణ వల్ల భూమి కోల్పోయే వారికే కాకుండా వాటిపై ఆధారపడి జీవనం సాగించే వారికి పరిహారం చెల్లించడానికి జీవో 38ని బుధవారం రెవిన్యూ శాఖ జారీ చేసింది. భూ యజమానులు కాని వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. బాధితులను గుర్తించే బాధ్యతను జాయింట్ కలెక్టర్లకు అప్పగించినట్టు పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి రూ.5.04 లక్షల వ్యయం చేసే డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇస్తారు. కుటుంబంలో ఒక్కరే ఉంటే ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద రూ.లక్షా 25 వేలు చెల్లిస్తారు. వన్‌టైమ్ సెటిల్‌మెంట్ ప్రకారం డబుల్ బెడ్‌రూమ్‌తోపాటు రూ.5 లక్షలు కానీ, లేదా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు అయితే 20 ఏళ్లపాటు నెలకు రూ.3000 భృతి చెల్లిస్తారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందని వారికి 20 ఏళ్లపాటు నెలకు రూ.2500 చెల్లిస్తారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు వన్ టైమ్ గ్రాంట్‌గా రూ.60 వేలు, ఇతరులకు రూ. 40 వేలు తొలి ఏడాది చెల్లిస్తారు. మరో చోటికి కుటుంబం తరలివెళ్లే పక్షంలో అదనంగా రవాణా చార్జీగా రూ.60 వేలు చెల్లిస్తారు. కులవృత్తిని జీవనాధారంగా కలిగిన వారికి వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద రూ. 30 వేలు చెల్లిస్తారు. బాధితులకు భవిష్యత్తులో పరిశ్రమలలో స్థానికులైన వారికి ఉద్యోగం కల్పించడానికి పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తారు.