రాష్ట్రీయం

వృద్ధిరేటులో తెలంగాణ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14:ఆదాయం వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. వ్యాట్, స్టేట్ ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం రాష్ట్రాల వారిగా కాగ్ లెక్కించింది. దీనిలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఆదాయ వృద్ధి రేటులో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచినట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్(కాగ్) ప్రకటించింది. 2015-16లో తెలంగాణ ఆదాయం 23,719 కోట్ల రూపాయలు కాగా, 2016-17లో 28,339 కోట్ల రూపాయలు. 19.5శాతం వృద్ధి రేటు. 17శాతం వృద్ధితో ఝార్కండ్ రెండవ స్థానంలో 16.1శాతంతో ఉత్తరాఖండ్ మూడవ స్థానంలో నిలిచింది. 2015-16లో ఆంధ్రప్రదేశ్‌కు 24,289 కోట్ల రూపాయల ఆదాయం కాగా, 2016-17లో 27వేల 042 కోట్ల రూపాయల ఆదాయం. వృద్ధి రేటు 11.3శాతం. దేశ వ్యాప్తంగా 8.6శాతం వృద్ధి రేటు ఉండగా, తెలంగాణ మాత్రం 21శాతం వృద్ధి రేటు సాధించింది. గుజరాత్ 1.1శాతం వృద్ధి రేటు సాధించింది. ఒరిస్సా, బీహార్ మాత్రమే మైనస్ వృద్ధి రేటును సాధించాయి. ఒడిస్సా మైనస్ రెండు శాతం వృద్ధి రేటు నమోదు కాగా, బీహార్ మైనస్ 18.5శాతం వృద్ధి నమోదు చేసింది.