రాష్ట్రీయం

జాతీయ స్థాయిలో ‘గీతం’ ఎంపిక పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: గీతం ఇంజనీరింగ్‌లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో ఎంపిక పరీక్ష నిర్వహిస్తున్నట్టు ప్రొ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్ తెలిపారు.
హైదరాబాద్ శివారులోని రుద్రారంలో విశాలమైన పచ్చదనంతో కూడిన ఆహ్లాదకర వాతావరణంలో గీతం వర్శిటీ నెలకొందని, అక్కడ సమకాలీన, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యాబోధన గరపుతోందని అన్నారు. ఎనిమిది బిటెక్ కోర్సులు, ఐదు ఎంటెక్ కోర్సులలో చేరడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ఆయన తెలిపారు. దరఖాస్తులను గీతం వెబ్‌పోర్టల్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పారు. తెలంగాణలో గీతం హైదరాబాద్ ప్రాంగణం, సైఫాబాద్, నాగోల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్‌లతో పాటు దేశవ్యాప్తంగా 37 పట్టణాల్లో గీతం వర్శిటీ ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తుందని అన్నారు. విద్యార్థుల అభిరుచి, అనుకూలతల ఆధారంగా పరీక్ష తేదీ, సమయాలను ఎంపిక చేసుకోవచ్చని అన్నారు. రెండు గంటల నిడివిలో పరీక్ష వంద ప్రశ్నలకు జరుగుతుందని అన్నారు. సరైన జవాబుకు నాలుగు మార్కులు కేటాయిస్తామని తప్పు చేస్తే ఒక మార్కు మైనస్ చేస్తామని తెలిపారు. ఆన్‌లైన్‌లో స్లైడింగ్ పద్ధతిలో సీట్ల కేటాయింపు జరుగుతుందని ఆయన వెల్లడించారు. దరఖాస్తులను మార్చి 31లోగా సమర్పించాల్సి ఉంటుందన్నారు. పరీక్షలు ఏప్రిల్ 16 నుండి 30 వరకూ జరుగుతాయని, తుది ఫలితాలను మే 5వ తేదీన వెల్లడిస్తామని ఆయన వివరించారు.