తెలంగాణ

సానియాకు సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: సేవా పన్ను ఎగవేత కేసులో సమన్లు అందుకున్న ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఈనెల 16న సర్వీస్ టాక్స్ కమిషనర్ ఎదుట హాజరయ్యే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆమె సర్వీస్ టాక్స్ కమిషనర్ ఎదుట హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది. ఆస్ట్రేలియా నుంచి ఆమె అమెరికా వెళ్లనున్నారు. దీంతో ఆమె తరఫు ప్రతినిధి కమిషనర్ ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఈ విషయంలో సానియా సంబంధీకులు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. సానియా గానీ, ఆమె తరఫు వారు కానీ సర్వీస్ టాక్స్ కమిషనర్ ఎదుట హాజరు కాక పోయినట్లయితే సానియాపై చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం 2014లో సానియా మీర్జాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ రూ. కోటి అందజేసింది. ఇందుకు సంబంధించి ఆమె సర్వీస్ ట్యాక్స్ చెల్లించలేదంటూ అధికారులు తాఖీదులు అందజేశారు. నిబంధనల ప్రకారం 14.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంది. ఈ పన్ను చెల్లించనందుకు గానూ ప్రస్తుతం జరిమానా కూడా చెల్లించుకోవాల్సి ఉందని ఆదాయ పన్ను శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.