రాష్ట్రీయం

శ్రీవారి పాదాల చెంత పిఎస్‌ఎల్‌వి సి-37 నమూనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 14: నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి బుధవారం 104 ఉపగ్రహాలతో నింగిలోకి ఇస్రో శాస్తవ్రేత్తలు కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్న పిఎస్‌ఎల్‌వి సి-37 నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించారు. ఉపగ్రహ ప్రయోగం జరిగే ప్రతిసారీ ముందుగా నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచే సాంప్రదాయాన్ని ఇస్త్రో శాస్తవ్రేత్తలు పాటిస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం ఇస్త్రో డైరెక్టర్లు ప్రొఫెసర్ ఎ.జయరామన్, డాక్టర్ అరుణన్, డాక్టర్ కనుంగో, డాక్టర్ జగదీష్ బృందం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి టిటిడి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈసందర్భంగా శాస్తవ్రేత్తలు తీసుకువచ్చిన నమూనాను స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించారు. ఇదిలావుండగా షార్ కేంద్రం అధికారులు మంగళవారం శ్రీకాళహస్తీశ్వరాలయానికి వచ్చారు. బుధవారం పిఎస్‌ఎల్‌వి సి-37 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న సందర్భంగా ఇస్రో డిజిఎం మృత్యుంజయరెడ్డి, డైరెక్టర్ కృష్ణమూర్తి ఆలయానికి వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకుని వెళ్లారు.