రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాల అధికారులతో నేడు బజాజ్ కమిటీ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక సమర్పించడానికి జస్టిస్ ఎకె బజాజ్ నేతృత్వంలో నియమించిన కేంద్ర నిపుణుల కమిటీ బుధవారం హైదరాబాద్‌లో ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశం కానుంది. తొలి విడతలో మూడు రోజుల పాటు ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశం కావడానికి సోమవారం హైదరాబాద్‌కు చేరుకున్న కమిటీ మంగళవారం విజయవాడకు వెళ్లిన విషయం తెలిసిందే. కృష్ణా జలాల పంపిణీపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల వాదనలను వేర్వేరుగా విన్న నిపుణుల కమిటీ చివరగా ఇరు రాష్ట్రాల అధికారులతో సంయుక్తంగా బుధవారం హైదరాబాద్‌లో సమావేశం కానుంది. తొలి విడతలో ఇరు రాష్ట్రాల వాదనలు విన్న కమిటీ మలి విడత పర్యటనలో క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులను సందర్శించనున్నట్టు కమిటీ చైర్మన్ ఎకె బజాజ్ చెప్పిన విషయం తెలిసిందే. ఇరు రాష్ట్రాల వాదనలు, క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుల సందర్శన అనంతరం తమ అధ్యయన నివేదికను మూడు నెలలలోగా కమిటీ కేంద్రానికి అందించనుంది. రాష్ట్ర విభజన అంశాలను సామరస్యపూర్వకంగా పరిష్కారించుకోవడానికి ఇప్పటికే ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీ గవర్నర్ సమక్షంలో చర్చలు ప్రారంభించింది. అయితే జల వివాదాలను తేల్చే అంశాన్ని నిపుణుల కమిటీ అప్పగించాలని ఇరు రాష్ట్రాలు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ కమిటీ రాష్ట్రానికి వచ్చింది.