రాష్ట్రీయం

విశ్వశాంతికి మార్గం సుగమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: భారతదేశానికి చెందిన ఇస్రో శాస్తవ్రేత్తలు ఒకే పర్యాయం 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపడం అత్యద్భుతమైన విషయమని విశ్వయోగి విశ్వంజీ పేర్కొన్నారు. బుధవారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, అంతరిక్ష విజ్ఞానంలో ప్రపంచంలో ఏ దేశం సాధించని ఘనత భారతదేశం సాధించిందన్నారు. ప్రపంచంలోని శాస్తవ్రేత్తలంతా ఆశ్చర్యపోయేలా 104 ఉపగ్రహాలను భారతీయ శాస్తవ్రేత్తలు నింగిలోకి పంపించారన్నారు. భారతీయ శాస్తవ్రేత్తలకు మహానుభావులు, రుషులు, యోగుల ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయన్నారు. భారత్-అమెరికా దేశాల మధ్య స్నేహ సౌభ్రాతృత్వాలు వెల్లివిరుస్తాయని తాను మొదటి నుండి చెబుతున్నానని, ప్రపంచ శాంతికి ఇది దోహదపడుతుందన్నారు. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో కొనసాగుతున్న హింస త్వరలో సమసిపోతుందని, విశ్వశాంతి నెలకొంటుందన్నారు. భారతీయ శాస్తవ్రేత్తలను విద్యార్థులు, యువత ఆదర్శంగా తీసుకోవాలని విశ్వంజీ సూచించారు. ఇస్రో శాస్తవ్రేత్తలు సాధించిన విజయంతో అబ్దుల్‌కలాం ఆత్మ పరవశించిపోతుందన్నారు.