రాష్ట్రీయం

హోదాయే బ్రహ్మాస్త్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 16: ‘ప్రత్యేకహోదా బ్రహ్మాస్త్రం లాంటిది. మన ప్రాంతంలోనే ఉద్యోగాలు వస్తాయి. జగన్ ఒక్కడు పోరాడితే చాలదు.. కలసికట్టుగా ఉద్యమిద్దామ’ని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఏపికి ప్రత్యేక హోదా కల్పిస్తామంటూ పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయకపోగా ఇతర రాష్ట్రాల మాదిరిగానే కేంద్రప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని విమర్శించారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి దోషిగా ఉన్నందునే కేంద్రం చేతిలో కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గుంటూరు మిర్చియార్డు సమీపంలో గురువారం జరిగిన యువభేరి సదస్సులో హోదా సాధన అంశంతోపాటు ప్రభుత్వ వైఫల్యాలను జగన్ తీవ్రంగా ఎండగట్టారు. హోదా అంశంపై జూన్ తరువాత జరిగే పార్లమెంటు సమావేశాల్లో వైసిపి ఎంపిలంతా రాజీనామా చేసి, ప్రజల్లోకి వెళతారని ప్రకటించారు. పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చిన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, ఎన్నికల సందర్భంగా మభ్యపెట్టిన చంద్రబాబు ఐదున్నర కోట్ల ఆంధ్రులను వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మంటగలిపారని, దీంతో ఎన్‌టిఆర్ ఆత్మ సైతం ఆత్మహత్య చేసుకునే దౌర్భాగ్య పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ తెలుగుద్రోహుల పార్టీగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు. గత రెండేళ్లుగా జరుగుతున్న సిఐఐ పారిశ్రామిక వేత్తల సదస్సులో 10.7 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. కనీసం 7వేల కోట్ల పెట్టుబడులైనా మంజూరు కాలేదన్నారు. సిఐఐ సదస్సులలో అనకాపల్లికి చెందిన త్రిలోక్‌నాథ్ అనే ప్రైవేటు సంస్థ పిఆర్‌ఒ, సంతగుడిపాడుకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ఏజెంట్‌గా పనిచేస్తున్న మరో వ్యక్తికి సూటుబూటువేసి ఎంఒయులు కుదుర్చుకున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదాతో వచ్చే రాయితీలు ఇస్తేనే పెట్టుబడులు వస్తాయన్నారు. ఈ అంశంపై వెంకయ్య, బాబు ప్లేటు ఫిరాయించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా కొనసాగుతున్న 11 రాష్ట్రాలలో 7.5 కోట్ల మంది జనాభా ఉంటే 2012-13లో ఆ రాష్ట్రాలకు 76వేల 890 కోట్లు కేటాయించారని, దేశం మొత్తంగా మిగిలిన 93 కోట్ల మందికి లక్షా 86వేల కోట్లు నిధుల కేటాయింపు జరిగిందని గుర్తుచేశారు. ఇప్పటి వరకు బస్సు, రైల్ రోకోలు మాత్రమే చూశామని విమానరోకో తొలిసారిగా టిడిపి ప్రభుత్వ హయాంలోనే జరిగిందన్నారు. హోదాపై గళమెత్తిన యువకులపై పిడి యాక్టు పెట్టాలని ఆదేశాలు జారీచేసిన సిఎంపై ఓటుకు నోటు వ్యవహారంతో పాటు చీటింగ్ చేసినందుకు టాడా కేసు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా సాధనతో పాటు విద్యార్థి, యువజనులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు.

చిత్రం..గుంటూరులో జరిగిన యువభేరి సభలో ప్రసంగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్