రాష్ట్రీయం

మెట్రోకు రూ.2500 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 16: విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు జర్మనీకి చెందిన సంస్థ 2500 కోట్ల రూపాయలు రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలో ఇందుకు సంబంధించిన విధివిధానాలు ఖరారు అవుతాయన్నారు. గతంలో జపాన్‌కు చెందిన జైకా సంస్థ రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని గుర్తు చేశారు. కానీ అప్పుడు తయారు చేసిన సవివర నివేదిక (డిపిఆర్)ను రుణం ఇచ్చేందుకు పరిగణనలోకి తీసుకోకుండా, కొత్త డిపిఆర్ తయారు చేస్తామని, ఇందుకు ఒక ఏజన్సీని నియమించాల్సి ఉంటుందని తెలిపారన్నారు. మరోసారి నివేదిక అంటే 9 నెలల సమయం పడుతుందని, దీంతో రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఇతర సంస్థలతో చర్చలు జరిపామన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు చాలా పురోగతిలో ఉందని, ఈ దశలో మరింత జాప్యం సరికాదని ప్రభుత్వం భావించినట్లు తెలిపారు. జర్మనీకి చెందిన సంస్థ రుణం ఇవ్వనుందని, ఈ ఏడాది ఆగస్టు నాటికి రుణం మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆ సంస్థ హామీ ఇచ్చిందన్నారు. ఈలోగా భూసేకరణ ప్రక్రియ నిర్వహించేందుకు వీలుగా 300 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయనుందన్నారు. ఈ మేరకు సిఎం ఆదేశాలు జారీ చేశారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2018-19 నాటికి విజయవాడ మెట్రో నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. 26 కిలోమీటర్ల మేర రెండు లైన్లలో మెట్రో రైలు నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం 20 వేల కోట్ల రూపాయలు సాయం చేస్తుందని, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోవాల్సి ఉంటుదని తెలిపారు. విశాఖపట్నం మెట్రోరైలు ప్రాజెక్టును పిపిపి విధానంలో చేపడతామని, ఇందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ గురువారం లేఖ రాశామని తెలిపారు. అనుమతి రాగానే టెండర్లు పిలుస్తామని తెలిపారు.
అమరావతి రాజధానిలో ఐకానిక్ భవనాలైన అసెంబ్లీ, హైకోర్టుల డిజైన్లను ప్రభుత్వానికి ఈ నెల 28న నార్మన్ ఫోస్టర్ సంస్థ ఇవ్వనుందని మంత్రి తెలిపారు. ఈ నెల 22న లండన్‌లోని ఆ సంస్థ కార్యాలయంలో ఈ డిజైన్లను ముందుగా పరిశీలించి, అవసరమైన మార్పులు, చేర్పులు తెలియచేస్తామన్నారు. అనంతరం ఆ డిజైన్లను 28న ప్రభుత్వానికి అందచేస్తారన్నారు. రాజభవన్, తదితర భవనాల డిజైన్లకు త్వరలో టెండర్లు పిలువనున్నామన్నారు.