రాష్ట్రీయం

అర్చకులపై కరుణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 16: వివిధ సమస్యల పరిష్కారానికి 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్న అర్చకులపై రాష్ట్ర ప్రభుత్వం కరుణ చూపింది. అర్చకుల వారసత్వ నిబంధనలు, సర్వీసు రూల్స్‌కు సంబంధించి ప్రభుత్వం గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. వివిధ దేవాలయాల్లో అర్చకత్వం చేస్తున్న వారు 1987లో సుప్రీం కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ప్రభుత్వం వేతన స్కేళ్ల కమిటీ, అర్చకుల సంక్షేమ కమిటీలను ఏర్పాటు చేసి నివేదికను కోర్టుకు అందజేసింది. ఆ తరువాత 9 ఏళ్లు గడిచినా నివేదిక అమలుకు నోచుకోలేదు. వివిధ ప్రధాన దేవాలయాల్లో పని చేస్తున్న అర్చకులు, ఆలయ సిబ్బంది సమ్మెకు దిగడంతో 2010లో ఒక కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2011లో ఈ కమిటీ నివేదికను ప్రభుత్వం ఆమోదించినా, అమలుకు నోచుకోలేదు. భక్తుల విరాళాల్లో 21.5 శాతం ప్రభుత్వం తీసుకుంటున్నా, అర్చకులకు, ఉద్యోగులకు వేతనాలు తదితర అంశాలను పట్టించుకోరన్న విమర్శలు ఉన్నాయి. పదవీ విరమణ ప్రయోజనాలు, అర్చకుల వారసత్వ నిబంధనలు, సర్వీస్ సమస్యలు పరిష్కారం కాక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చొరవ తీసుకుని హిందూ ధార్మిక సంస్థలు, వారసత్వ అర్చకత్వ అర్హతలు, వేతనాల నిబంధనలు- 2017 పేరిట చాలాకాలంగా అమలు కాని నిబంధనల అమలుకు శ్రీకారం చుట్టారు. అర్చకుల ఉద్యోగ నియామకాలు, సవరణ చట్టం అమలుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేయడం 20 సంవత్సరాలుగా నిలిచిన అర్చక సంక్షేమాన్ని గౌరవించడంగా తెలంగాణ అర్చక సమాఖ్య అధ్యక్షుడు సిఎస్ రంగరాజన్ అభివర్ణించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, అర్చక సంక్షేమ నిధి చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎపి అర్చక సమాఖ్య హర్షం
అర్చక సంక్షేమానికి జీవం పోస్తూ చంద్రబాబునాయుడు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయబాబు, కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దింటి రాంబాబు హర్షం వ్యక్తం చేశారు. దీనికోసం కృషి చేసిన అర్చక సంక్షేమ నిధి చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావుకు కృతజ్ఞతలు తెలిపారు.