రాష్ట్రీయం

తమిళ విద్యార్థులకు తెలుగు ‘పరీక్ష’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 6 : ఆంధ్రప్రదేశ్‌లో విద్యనభ్యసిస్తున్న తమిళ విద్యార్థులకు కూడా తమిళనాడు తరహాలో తెలుగు పరీక్ష రాయాలనే కాలాన్ని నిర్దేశించండని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కేంద్ర హిందీ సమితి సభ్యుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ సూచించారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలో తెలుగు విద్యార్థుల పట్ల అక్కడి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. తమిళ భాషేతర 10వ తరగతి విద్యార్థులందరూ తమిళ భాషలోనే పరీక్షలు రాయాలని అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చెయ్యడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను భంగం కలిగించడమేనన్నారు. తమిళనాడు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా, భాష అల్ప సంఖ్యాకుల కమీషన్ తప్పుపట్టినా, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా వాటిని బేఖాతరు చేస్తూ అక్కడి ప్రభుత్వం తెలుగు భాష విద్యార్థులను ఇబ్బందులకు గురి చెయ్యడం అరాచకమన్నారు. ఇలాంటి సమయంలో తమిళనాడు గవర్నర్ రోశయ్య కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తమిళనాడు రాష్ట్రంలో తెలుగు, కన్నడ, మళయాళం, ఉర్దూ, సంస్కృతం లాంటి భాషలకు సంబంధించి 2.75లక్షల మంది విద్యార్థులు ఉన్నారన్నారు. ఇందులో 92 వేల మంది తెలుగు విద్యార్థులే ఉన్నారన్నారు. వారి ప్రయోజనాలకు భంగం కలుగుతున్నప్పడు తెలుగురాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. 2006లో అధికారంలో ఉన్న కరుణానిధి ప్రభుత్వం తమిళ విద్యను నిర్బంధ విద్యగా చట్టం చేసిందన్నారు. ఆ సమయంలో అక్కడ అల్ప భాష మైనారిటీ సంఘాలకు సంబంధించిన నాయకులు అనేకమంది తమిళనాడు ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్న జయలలిత దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లామన్నారు.
ఇది దుర్మార్గమని, ఘోర తప్పిదమని తాను అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తానని ఆమె హామీ ఇవ్వడం కూడా జరిగిందన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన జయలలిత ఆ చట్టాన్ని రద్దు చెయ్యడం మాట పక్కన పెట్టి 2015 సంవత్సరంలో తమిళనాడులో ఉన్న తెలుగు, మళయాలం, కన్నడ, ఉర్దూ, సంస్కృతం లాంటి తమిళేతర మాతృ భాష కలిగిన వారు తమిళంలోనే పరీక్ష రాయాలంటూ ఆరు నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేశారన్నారు. దీంతో అల్ప భాష మైనారిటీ సంఘాలు తమిళనాడు హైకోర్టును ఆశ్రయించారన్నారు. ఈ సందర్భంగా అక్కడ ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ ఈ ఏడాది విద్యా సంవత్సరానికి పరీక్షలు రాసే తమిళేతర భాషా విద్యార్థులు తాము తమ మాతృ భాషలోనే పరీక్షలు రాస్తామని డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించారన్నారు. ఆ ప్రకారమే తమిళ భాషేతర విద్యార్థులు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తాము తెలుగులో పరీక్షలు రాసుకోవడానికి అనుమతించాలని లిఖిత పూర్వకంగా కోరామన్నారు. అయితే తమిళనాడు ప్రభుత్వం వాటిని కూడా పక్కన పెట్టి 2015 నవంబర్ 11న ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు విడుదల చేశారన్నారు. ఇందుకు మించిన దారుణం మరొకటి లేదన్నారు. ఒక చిత్తూరు జిల్లాలోనే 12 వేల మంది తమిళ విద్యార్థులు ఉన్నారని 60 పాఠశాలలు ఉన్నాయని ఒక టీచింగ్ కళాశాల కూడా ఉందన్నారు. ఇక్కడి తెలుగు వారు తమిళులను సోదర భావంతో చూస్తున్నా తమిళనాడు ప్రభుత్వం తెలుగువారిని వేధించడం సరికాదన్నారు. ఇటీవల 70 మంది తెలుగు వారు అమెరికాకు వెళితే అక్కడ వారు తిరస్కరించినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి అమెరికా అధికారులతో చర్చించారన్నారు. అదే తరహాలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చించి తమిళనాడు ప్రభుత్వానికి తగిన విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.

తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విలేఖరులతో
మాట్లాడుతున్న యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్