రాష్ట్రీయం

జనంతో మమేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16:ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్‌కు కూతవేటు దూరంలో కొత్తగా నిర్మించిన ‘జనహిత’ భవనంలో ప్రజలతో తరచూ మమేకం కావాలని కెసిఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఈ కార్యక్రమానికి ఆయన శుక్రవారమే శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఒక్కో రోజు ఒక కుల వృత్తికి చెందినవారితో సమావేశమవుతారు. ఆ వృత్తికి సంబంధించి వారు ఎదుర్కొంటున్న సాధకబాధకాల గురించి చర్చించి, వారికి ప్రభుత్వపరంగా చేయూతనందిస్తారు. అలాగే వివిధ సమస్యలపై వచ్చే వారినీ సిఎం కలుస్తారు. జనహిత భేటీల వల్ల అవినీతి సైతం తగ్గే అవకాశం ఉందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. సమస్యల పరిష్కారంలో మధ్యవర్తుల ప్రమేయాన్ని నివారించవచ్చన్న ఆలోచన కూడా ఉంది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోకి ఇప్పటివరకు మంత్రులు, అధికారులు, శాసన సభ్యులు మినహా సామాన్యులకు వెళ్లే అవకాశం లేదు. క్యాంప్ ఆఫీస్‌కు వచ్చే జనం కోసం ప్రగతి భవన్‌లోనే ప్రత్యేకంగా ‘జనహిత’కు రూపకల్పన చేశారు. మధ్యప్రదేశ్‌లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని దాదాపు 15 వందల మందితో ఒకేసారి సమావేశం అయ్యే విధంగా నిర్మించారు. దాని స్ఫూర్తితోనే జనహిత రూపుదిద్దుకుంది.
శుక్రవారం ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినం కావడంతో ఆ రోజునుంచే ప్రజలతో భేటీ కావడం బాగుంటుందన్న ఆలోచనతో ఈ కార్యక్రమానికి శుక్రవారమే శ్రీకారం చుడుతున్నారు. ఈ సందర్భంగా మరణించిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులతో కెసిఆర్ శుక్రవారం జనహితలో సమావేశం కానున్నారు. వారికి ఆర్థిక సహాయం అందిస్తారు.
జనహిత భవనంలో ప్రత్యేకంగా ఒక స్టూడియో కూడా ఏర్పాటు చేశారు. ఈ స్టూడియో నుంచి వివిధ అంశాలపై ముఖ్యమంత్రి ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. మీడియాతోనూ ఈ స్టూడియోనుంచే మాట్లాడాలని సిఎం భావిస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రులు దూరదర్శన్ స్టూడియో నుంచి ప్రజలతో మాట్లాడేవారన్న సంగతి తెలిసిందే. ప్రజలతో మాట్లాడటం వల్ల పథకాల అమలు తీరు, ప్రజల అభిప్రాయాల గురించి నేరుగా తెలుసుకునే అవకాశం కలుగుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.

చిత్రం..ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం సమీపంలోని జనహిత భవనం