రాష్ట్రీయం

‘పల్లడం’ ఆదర్శంగా వరంగల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: టెక్స్‌టైల్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న తమిళనాడులోని కొయంబత్తూరులో పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు పర్యటించారు. తిరువూరు పల్లడంలోని టెక్స్‌టైల్ పరిశ్రమలు సాధించిన విజయాలు, ప్రగతి, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ వ్యూహాలు, ప్రైవేటు భాగస్వామ్యం, ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాల అధ్యయనం కోసం మంత్రి ఈ పర్యటన సాగించారు. 35వేల కోట్ల రూపాయల విలువైన వస్త్ర పరిశ్రమగా ఎదిగిన చిన్న గ్రామం తిరుపూర్‌ను తొలుత సందర్శించారు. అక్కడి నేత పనివారితో మాట్లడారు. తిరుపూర్ ఎక్స్ పోర్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. మన దేశంతో పాటు విదేశాలకు కూడా వస్త్రాలను ఎగుమతి చేస్తున్న తిరుపూర్ సక్సెస్ స్టోరీని అడిగి తెలుసుకున్నారు.
అక్కడ అమలు చేస్తున్న విధానాలపై అధికారులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం వరంగల్‌లో ఏర్పాటు చేయనున్న మెగా టెక్స్‌టైల్ పార్క్ గురించి కెటిఆర్ వారికి వివరించారు. తిరుపూర్ పరిశ్రమ సాధించినట్టుగానే జెర్ప్ లిక్విడ్ డిశ్చార్జ్‌ను తాము ప్రారంభించే వరంగల్ పార్క్‌లో మొదటి రోజు నుంచే జడ్‌ఎల్‌డి ఉంటుందని చెప్పారు. తిరుపూర్‌లో ఉన్న వస్త్ర పరిశ్రమలు తమ విస్తరణ ప్రణాళికలో వరంగల్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. తిరుపూర్ పారిశ్రామిక వేత్తలు కోరినట్టుగా 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్లగ్ అండ్ ప్లేకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఆ పార్క్‌లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు దేశంలోనే అత్యుత్తమ ప్రోత్సాహకాలతో ప్యాకేజీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కెటిఆర్ తెలిపారు. వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌లో కార్మికులు, ఇనె్వస్టర్లకు హౌజింగ్, విద్య, ఆరోగ్యంతో పాటు అన్ని వౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి చెప్పారు. తిరుపూర్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్‌కు ప్రత్యేకంగా ఒక బ్లాక్ కేటాయిస్తామని చెప్పారు. అసోసియేషన్ ప్రతినిధులు వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌లో కనీసం పది యూనిట్ల ఏర్పాటుకు సూత్ర ప్రాయంగా అంగీకారం తెలిపారు. టెక్స్‌టైల్ పరిశ్రమపై మంత్రి కెటిఆర్‌కు ఉన్న అవగాహన తమను కట్టిపడేసిందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. టెక్స్‌టైల్ రంగంలో ఇంత పరిజ్ఞానం, దూరదృష్టి ఉన్న నాయకున్ని చూడలేదని అన్నారు.
అనంతరం పల్లడం హైటెక్ వీవర్స్ పార్క్‌ను సందర్శించారు. చేనేత నుంచి మరమగ్గాల వైపు నేతన్నలను తీసుకు వచ్చి వారికి జీవనోపాధి పెంచడం ఈ పార్క్ సాధించిన విజయం. సిరిసిల్ల పార్క్‌ను పల్లడం మోడల్‌లో అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని కెటిఆర్ అధికారులకు చెప్పారు.
టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ విద్యలో ప్రముఖ విద్యా సంస్థ కోయంబత్తూరుకు చెందిన పిఎస్‌జితో తెలంగాణ ప్రభుత్వం ఎంఒయు కుదుర్చుకుంది. వరంగల్‌లో ఏర్పాటు చేసే టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటులో పరస్పర భాగస్వామ్యం, అకాడమిక్- టెక్నికల్ అసిస్టెంట్ , స్కిల్ డెవలప్‌మెంట్ , ఎంటర్ ప్రైన్యూర్ షిప్ ట్రైనింగ్, ఆర్ అండ్ డి విభాగాల్లో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి అవసరం అయిన అకాడమిక్ సౌకర్యాన్ని పిఎస్‌జి విద్యా సంస్థ అందిస్తుంది. తెలంగాణ దీనికి ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పర్యటనలో మంత్రితో పాటు పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, డైరెక్టర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టైక్స్‌టైల్స్ శైలజా రామయ్యార్‌లు పాల్గొన్నారు.

చిత్రం..తమిళనాడులో పల్లడం హైటెక్ వీవర్స్ టెక్స్‌టైల్ పరిశ్రమను పరిశీలిస్తున్న మంత్రి కెటిఆర్