రాష్ట్రీయం

నేడు రిజర్వ్ బ్యాంకు ఉద్యోగుల సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: అఖిల భారత రిజర్వు బ్యాంక్ ఉద్యోగుల సంఘం 32వ జాతీయ సమావేశాన్ని మూడు రోజులపాటు నిర్వహించేందుకు ఉద్యోగుల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 17 నుంచి 19వరకు మూడు రోజులు నిర్వహించనున్నారు. రవీంధ్రభారతిలో 17వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ డాక్టర్ సి.రంగరాజన్ ఈ సమావేశాన్ని ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి, రిజర్వు బ్యాంక్ ఉద్యోగుల సంఘం రిసెప్షన్ కమిటీ చైర్మన్ నాయిని నర్సింహా రెడ్డి ఈ సమావేశానికి స్వాగతోపన్యాసం చేస్తారని ఉద్యోగుల సంఘం తెలిపింది. రిజర్వు బ్యాంక్‌కు చెందిన ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌లు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. అఖిల భారత స్థాయి సమావేశం హైదరాబాద్‌లో జరగడం ఇదే తొలిసారి. రవీంధ్రభారతిలో 17న సమావేశం ప్రారంభోత్సవం జరుగుతుంది. 18, 19 తేదీల్లో బేగంపేటలోని ఆర్‌బిఐ సిబ్బంది నివాసాల ప్రాంగణంలోని కమ్యూనిటీ హాల్లో ప్రతినిధుల సమావేశం జరుగుతుంది.