రాష్ట్రీయం

అవినీతి సర్పంచ్‌లను కలెక్టర్లు తొలగించవచ్చు: హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: అవినీతి అభియోగాల కేసుల్లో గ్రామ సర్పంచ్‌లను విచారణ లేకుండా పదవి నుంచి తొలగించే హక్కు, సాధికారత జిల్లా కలెక్టర్లకు ఉందని హైకోర్టు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం మేడ్చెల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బౌరంపేట గ్రామ సర్పంచ్ కె మంగమ్మను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఎ యాదిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించి పై మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో సర్పంచ్ మంగమ్మపై అవినీతి అభియోగాలురావడంతో జిల్లాకలెక్టర్ ఆమెను పదవి నుంచి తొలగించారు. తనను తొలగించడాన్ని సవాలుచేస్తూ హైకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జికోర్టు ఈ విషయమై సర్పంచ్ మంగమ్మ తొలగింపును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసు హైకోర్టు ధర్మాసనానికి చేరింది. ఈ కేసులో పంచాయితీరాజ్ చట్టం కింద కలెక్టర్‌కు సర్పంచ్‌పై అవినీతి ఆరోపణలు వస్తే తొలగించే అధికారం ఉందని హైకోర్టు పేర్కొంది. సర్పంచ్‌ను తొలగించే ముందు విచారణ ఉండాలన్న నిబంధన లేదని కోర్టు పేర్కొంది.