రాష్ట్రీయం

సిబిఐ సీజ్ చేసిన స్థలం విక్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: ఓ కేసులో సీబీఐ సీజ్ చేసిన స్థలానే్న అమ్మేశాడో ప్రబుద్ధుడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడిని సిసిఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సిబిఐ సీజ్ చేసిన ఓ భూమిని ఎం సాంబశివరావు అనే వ్యక్తి బెంగుళూరుకు చెందిన ఓ ప్రశాంత్ శ్రీశైలం అనే పారిశ్రామికవేత్తకు రూ. 2కోట్లకు విక్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరిపిన పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. 1996లో జరిగిన రూ. 133 కోట్ల యూరియా స్కాంలో కూడా సాంబశివరావు నిందితుడు. కాగా అప్పట్లో నిందితుడు సాంబశివరావు తీహార్ జైలులో శిక్ష అనుభవించాడు. గుంటూరు జిల్లా ఏమినేనివారి పాలెంకు చెందిన ఎం సాబంశివరావు, వ్యవసాయంలో బిఎస్సీ పూర్తి చేశాడు. 1995లో టర్కిష్‌లోని కర్సన్ లిమిటెడ్ కంపెనీకి భారత ఏజెంట్‌గా నియమితుడై ఎరువులు సరఫరా చేసేవాడు. కేంద్రప్రభుత్వంతో ఎరువులు సరఫరా చేసేందుకు నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుని రూ. 133కోట్లు అవినీతికి పాల్పడ్డాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన సిబిఐ అతణ్ని అరెస్టు చేసింది. 1996లో కేసు విచారణకు రాగా, సాంబశివరావుకు సంబంధించి హైదరాబాద్‌లోని రెండు ఎకరాల 20 గుంటల స్థలాన్ని సిబిఐ అధికారులు సీజ్ చేశారు. అప్పట్లో తీహార్ జైలుకు వెళ్లిన సాంబశివరావు బయటకు వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. సాయిశ్రీ ప్రాజెక్ట్స్ ప్రై.లి. పేరుతో బేగంపేట్‌లో ఆఫీస్‌ను ఏర్పాటు చేసుకొని మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగాడు. 2013లో బెంగుళూరుకు చెందిన ప్రశాంత్ శ్రీశైలం అనే వ్యాపారవేత్తతో సంబంధాలు పెంచుకుని సదరు సిబిఐ సీజ్ చేసిన 2.40 ఎకరాల స్థలాన్ని డెవలప్‌మెంట్ పేరుతో 70:30 వాటాగా ఒప్పందం కుదుర్చుకుని రూ. 1.89 కోట్లు తీసుకొని మోసం చేశాడని గురువారం సిసిఎస్ డిసిపి మోహంతి తెలిపారు. ప్రశాంత్ శ్రీశైలం ఫిర్యాదు మేరకు మణికొండలో సాంబశివరావును సిసిఎస్ పోలీసులు అరెస్టు చేసి జుడిషియల్ రిమాండ్‌కు తరలించినట్టు డిసిపి పేర్కొన్నారు.