రాష్ట్రీయం

పక్క చూపులొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 17:ఇతర నియోజకవర్గాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఒంటెత్తు పోకడలు పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభేదాలు ఉంటే వాటిని ఇంటికే పరిమితం చేసుకోవాలని, పార్టీ వరకూ తీసుకురావద్దని హెచ్చరించారు. గెలుపుగుర్రాలకే భవిష్యత్తులో సీట్ల కేటాయింపు ఉంటుందని, ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ సొంతం చేసుకోవాలని సూచించారు. విజయవాడలోని ఎ కనె్వన్షన్ సెంటర్‌లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నిర్మాణం- బడ్జెట్ 2017-18పై శుక్రవారం వర్కుషాపు నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో సిఎం మాట్లాడుతూ గతంలో మొహమాటానికి పోయి కొంతమందికి సీట్లు ఇవ్వడం వల్ల వారు ఓడిపోయిన ఘటనలు ఉన్నాయని, ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నవారికే సీట్లు ఇస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధిని, సాంకేతికతను, ప్రజాభిప్రాయాన్ని బ్యాలెన్సు చేస్తున్నానని, గతంలో చోటు చేసుకున్న పొరపాట్లవల్ల పార్టీ నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాననీ ముఖ్యమంత్రి చెప్పారు. ప్రజలు సమర్థ నాయకత్వాన్ని చూస్తారు తప్ప, కులం, మతాలను పట్టించుకోరంటూ తెలంగాణ సిఎం, ప్రధాని మోదీలను ఉదహరించారు. ఇటీవలికాలంలో ఆకస్మికంగా నాలుగు జిల్లాల్లో క్రమశిక్షణా రాహిత్యం పెరగటం తనను షాక్‌కు గురి చేసిందన్నారు. ప్రజల్లో దాని ప్రభావం ఉంటుందని, ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే ఫోన్ లేదా మెసేజ్ వస్తుందన్నారు. నేతల సమస్యలు వింటానని, ఏ జిల్లా బలహీనంగా ఉందో చూసి బలోపేతం చేద్దామన్నారు. భవిష్యత్తులో తమకు అధికారం దక్కుతుందన్న ఆలోచనే ఇతరులు ఎవరికీ రాకూడదన్నారు. వివిధ అంశాలపై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తే, చాలా అంశాల్లో 70 శాతం మేర మనతోనే ఉన్నట్లు తెలుస్తోందని, కానీ కొన్ని అంశాల్లో అలా లేదని, దీనిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అసెంబ్లీ స్పీకర్ కోడెల వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేశారన్నారు. 13, 14 ఫైనాన్స్ కమిషన్‌కు సంబంధించిన 5 వేల కోట్ల నిధులను కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేయకపోతే, తాము అభివృద్ధికి ఖర్చు చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. నీరు, విద్యుత్ సమస్యలను అధిగమించామన్నారు. నదులను అనుసంధానం చేశామన్నారు.