రాష్ట్రీయం

నెల్లూరు జడ్పీ సిఇఓ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 17: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న అభియోగంపై శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జడ్పీ సిఇఓ బొబ్బా రామిరెడ్డి ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. జడ్పీ సిఇఓతోపాటు, నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్, జిల్లా పంచాయతీ అధికారిగా కూడా ఆయన అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నెల్లూరులోని ఆయన స్వగృహంతోపాటు గుంటూరు, తిరుపతి, కావలి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లోని 15 చోట్ల ఆయన
బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏకకాలంలో అధికారులు దాడులు నిర్వహించారు. నెల్లూరు ఏసిబి డిఎస్పీ తోట ప్రభాకర్ తెలిపిన సమాచారం మేరకు 14 ఇంటి స్థలాలు, గుంటూరులో ఇల్లు, నెల్లూరులో నాలుగంతస్తుల భవంతి, గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో 9 ఎకరాల భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రామిరెడ్డి 50 లక్షల నగదును ఇద్దరు వ్యక్తులకు అప్పుగా ఇచ్చినట్లు గుర్తించారు. సోదాల సమయంలో ఇంట్లో రూ.2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరులోని ఓ జాతీయబ్యాంకులో 2 లాకర్లలో 1300 గ్రాముల బంగారు నగలు ఉన్నట్టు గుర్తించారు. పూర్తిస్థాయిలో విచారించేందుకు జడ్పీ సిఇఓ రామిరెడ్డిని అరెస్టుచేసినట్టు ఎసిబి అధికారులు చెప్పారు. రామిరెడ్డి స్వస్థలమైన గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం తక్కెళ్లపాడు గ్రామంలో బినామీ పేర్లతో సుమారు 50 లక్షల రూపాయల విలువైన స్థల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. తక్కెళ్లపాడులోని ఆయన సోదరుడు నాగిరెడ్డి, అత్త సీతారావమ్మ ఇళ్లలో బినామీ పేర్లపై ఉన్న సుమారు 50 లక్షల విలువైన స్థల దస్తావేజులు లభ్యమయ్యాయి. తొలుత రామిరెడ్డి తహశీల్దార్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి క్రమంగా ఎదుగుతూ జెడ్పీ సిఇఒగా పదోన్నతి పొంది, ప్రస్తుతం నెల్లూరులో పనిచేస్తున్నారు. ఆయన వచ్చే నెలలో పదవీ విరమణ చేయాల్సి ఉంది.