రాష్ట్రీయం

అర్చకుల రిటైర్మెంట్ వయసు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 17:అర్చకుల పదవీ విరమణ వయసును 58 నుంచి 65 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు వెల్లడించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అడ్మిన్‌స్ట్రేషన్ సిబ్బందికి పదవీ విరమణ వయసును 60కి పెంచుతున్నామని, త్వరలో ఈమేరకు ఉత్వర్వులు జారీ చేయనున్నామని చెప్పారు. ప్రభుత్వ నిబంధనల మేరకే ఈ ఉత్తర్వులు వర్తింపచేస్తామన్నారు. వివిధ ఆలయాల్లో భక్తులకు సౌకర్యాల పెంపుతో సహా ఆలయాల వివరాలు తెలిపేలా వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. వెబ్‌సైట్ ఏప్రిల్ నెలాఖరు నుంచి అందుబాటులోకి వస్తుందన్నారు. ఆలయాల్లో ఎల్‌ఇడి బల్బుల విని యోగం, సోలార్‌వాటర్ హీటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. దేవాదాయ శాఖ భూముల్లో ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించిన వాటికి నిరంభ్యతర పత్రాలను ఇచ్చేందుకు వీలుగా జిల్లాల్లో అదాలత్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ నేతృత్యంలో ఈ అదాలత్‌లను నిర్వహిస్తామన్నారు. వేదపాఠశాలకు, ఇతర విద్యాసంస్థలకు మరిన్ని నిధులు ఇచ్చి అభివృద్ధి చేసేందుకు నిర్ణయించామన్నారు. అవసరమైతే కొన్ని కొత్త కోర్సులను కూడా ప్రారంభిస్తామన్నారు.