రాష్ట్రీయం

విశాఖలో ఐటీ నిర్వీర్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 17: విశాఖను ఐటి హబ్‌గా మార్చుతామని చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి చెబుతున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. గత మూడేళ్లలో విశాఖకు ఒక్కటంటే ఒక్క కొత్త ఐటి కంపెనీ రాలేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ విశాఖలో ఐటి కంపెనీ ఏర్పాటు చేయడానికి ఎవరైనా ముందుకు వచ్చినా, వారికి కనీసం ఒక్క ఎకరా స్థలాన్ని కూడా కేటాయించలేని దుర్భర స్థితిలో అధికార యంత్రాంగం ఉంది.
రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద నగరం, ఐటి పరిశ్రమలకు అనువైన ప్రాంతమైన విశాఖ నగరాన్ని ఐటి హబ్‌గా మార్చాలని చంద్రబాబు భావించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కూడా విశాఖ నుంచి ఐటి ఎగుమతులను పెంచేందుకు అంకురార్పణ జరిగింది. ఇందులో భాగంగానే రుషికొండ హిల్-1,2,3ల కలిపి ఐటి సెజ్‌గా ఏర్పాటు చేశారు. వౌలిక సదుపాయాల మాట ఎలా ఉన్నా, ఒక డజను కంపెనీలు సెజ్‌లో పనులు ప్రారంభించాయి. ఇందులో కేవలం నాలుగు, ఐదు కంపెనీలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ సెజ్‌ను డి-నోటిఫై చేస్తే, కొత్త ఐటి కంపెనీలు హిల్స్‌మీద వస్తాయని ఐటి సంస్థల యజమానులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే సెజ్‌ను డి-నోటిఫై చేయడం వలన అనేక అవకతవకలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఈ ప్రక్రియ మూలన పడింది.
ఇదిలా ఉండగా రుషికొండ ఐటి సెజ్‌లో 300 కోట్ల రూపాయలతో వ్యయంతో 10 లక్షల చదరపు అడుగుల సిగ్నేచర్ టవర్‌ను నిర్మిస్తామని ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా చెప్పుకొస్తోంది. కనీసం దీనికి శంకుస్థాపన కూడా చేయలేని దుస్థితి నెలకొంది. ఎస్‌టిపిఐ ఇంక్యుబేషన్ సెంటర్‌ను నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం 40 కోట్ల రూపాయలను మంజూరు చేసి చాలా కాలమే అయింది. ఇప్పటి వరకూ దీని గురించి పట్టించుకున్న నాథుడే లేడు. అలాగే 50 వేల అడుగుల వైశాలంతో స్టార్టప్ విలేజ్‌ను నిర్మించారు. ఐటి రంగంలో కొత్త పరిశ్రమల స్థాపనకు ఈ స్టార్టప్ విలేజ్ దోహద పడుతుంది. ఇప్పుడు ఈ స్టార్టప్ విలేజ్‌లో ఒకటి, రెండు కంపెనీలు మాత్రమే ఉన్నాయి. ఎంతో ఘనంగా ఈ స్టార్టప్ విలేజ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఇప్పుడు అదికాస్తా మూలనపడేట్టు ఉంది.
ఐటి పార్క్ ఏర్పాటులో జాప్యం
విశాఖ-్భమిలి బీచ్ రోడ్డులోని కాపులుప్పాడ వద్ద 400 కోట్ల రూపాయలతో 1300 ఎకరాలను చదును చేసి, అక్కడ ఐటి పార్క్ నిర్మిస్తామని గడచిన మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం చెపుతున్నా, అధికారులు చొరవ చూపకపోవడమో, లేక ప్రభుత్వ ఆమోదం లభించకపోవడమో తెలియదు కానీ, దీనివలన కొత్త కంపెనీలకు కావల్సిన స్థలం లేకుండాపోయింది.
తరలిపోతున్న సంస్థలు
సెంటర్ ఫర్ డవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సి-డాక్) విశాఖకు మంజూరైంది. దీన్ని విజయవాడకు తరలించేందుకు ప్రభుత్వ స్థాయిలో ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే విశాఖకు మంజూరైన వివిధ సంస్థలను కాకినాడ, విజయవాడకు తరలించుకుపోయిరు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్‌ను కేంద్ర ప్రభుత్వం విశాఖకు మంజూరు చేసింది. దీన్ని కాకినాడకు తీసుకువెళ్లిపోయారు. అదేవిధంగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారన్ ట్రేడ్ విశాఖకు మంజూరైతే, దాన్ని కాకినాడకు తీసుకువెళ్లిపోయారు. విశాఖకు మంజూరైన బయోటెక్నాజీ ఇంక్యుబేషన్ సెంటర్‌ను విజయావాడకు తరలించుకుపోయారు. అలాగే, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ విజయవాడకు వెళ్లిపోతోంది.