రాష్ట్రీయం

భూమి బదులు ఉపాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితులకు సాగుభూమి పథకంలో మార్పులు తెచ్చే యోచనలో ఉంది. భూమి బదులు ఇతరత్రా ఉపాధి కల్పించే పథకాలు చేపట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే హడావుడిగా ఈమేరకు నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వంపై అపవాదు వచ్చే అవకాశం ఉందని, ఒకటికి నాలుగు పర్యాయాలు ఆలోచిస్తున్నారు. సాగుభూమి స్థానంలో ఇతర ఉపాధి పథకాలను చేపట్టేముందు సంబంధిత వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దళితులకు సాగుభూమి పథకం విషయంలో ప్రభుత్వ భూమి లేకపోవడంతో ప్రైవేట్ భూమి కొనుగోలు చేసి ఇవ్వాల్సి వస్తోంది. రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ సాగుభూమి సాధారణ ధరలకు లభించకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. 2014 నుండి ఇప్పటి వరకు కొనుగోలు చేసిన భూమికి ఒక్కో ఎకరాకు సరాసరిన ఐదు లక్షల రూపాయలు, ఆపైన ప్రభుత్వం వెచ్చించింది. ఒక్కో దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తామంటూ సిఎం కెసిఆర్ గతంలో ప్రకటించారు. తాజా ధరలను పరిగణనలోకి తీసుకుంటే ఒక్కో కుటుంబంపై 15 లక్షలు, ఆపైన వెచ్చించాల్సి వస్తోంది. గతంలో ఎకరా భూమి ధర రూ.20 వేలు, రూ.30 వేలు ఉండగా, ప్రస్తుతం ఆ ధరలు 15 రెట్లకు పైగా పెరిగింది. ఖమ్మం జిల్లాలో ఒక్కో ఎకరాకు ప్రభుత్వం దాదాపు ఏడు లక్షల రూపాయలకు కొనుగోలు చేసి దళితులకు ఇచ్చింది. అలాగే వరంగల్ జిల్లాలో ఐదు లక్షల రూపాయలపైగా ఒక్కో ఎకరం చొప్పన కొనుగోలు చేసి ఇచ్చారు. దళితులకు ఇచ్చేందుకు ప్రభుత్వ భూమి లేకపోవడంతో ప్రైవేట్ భూమిని కొనుగోలు చేసి ఇవ్వాల్సి వస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం 2014-15, 2015-16 సంవత్సరాల్లో రెండు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని మాత్రం అతికష్టంగా ఈ పథకం ద్వారా దళితులకు ఇవ్వగలిగారు. 2014-15, 2015-16 సంవత్సరాల్లో 6,290 ఎకరాల భూమిని దళితుల పేరుతో రిజిస్టర్ చేశారు. 2016-17లో ఇప్పటి వరకు 241మంది లబ్దిదారులకు 621 ఎకరాల భూమిని మాత్రం రిజిస్టర్ చేయగలిగారు. ఏ జిల్లాలోనూ ప్రభుత్వ భూమి లేకపోవడం వల్ల భారీగా నిధులు వెచ్చిస్తూ, ప్రైవేట్ భూమి కొనుగోలు చేసి ఇవ్వాల్సి వస్తోంది. దీనివల్ల ఫలితాలు కూడా పెద్దగా సమకూరడం లేదని తెలుస్తోంది. ఒక్కో ఎకరాపై ఏటా 10 వేల రూపాయలు కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఒక్కో పర్యాయం రైతులు పంటలపై పెట్టిన పెట్టుబడులు కూడా రావడంలేదు. ఈ పరిస్థితిలోనే దళితులకు నెలకు కుటుంబానికి సరిపడేవిధంగా ఆదాయం వచ్చే పథకాలు చేపడితే ఎలా ఉంటుందన్న ఆలోచనను సర్కారు చేస్తోందని తెలుస్తోంది. అందుకే భూమి పంపిణీ బదులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. సాధారణంగా ఒక్కో కుటుంబంపై నాలుగైదు లక్షలు ఖర్చు చేస్తే నెలకు 20 వేల రూపాయల నుంచి 40 వేల రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఐదు లక్షలు వెచ్చించి ఒక వాహనం కొనుగోలు చేసి ఇస్తే, దానిపై మంచి ఆదాయం లభిస్తుందని లెక్కలు వేసి తేల్చారు. ఒక్కో వాహనంపై అన్ని ఖర్చులూ తీసేసిన తర్వాత ఎంతకాదన్నా నెలకు 30 వేల రూపాయల వరకూ ఆదాయం లభిస్తుందని లెక్కలు వేశారు. అంటే ఏటా మూడు లక్షల రూపాయలకుపైగా ఆదాయం లభించే అవకాశం ఉందన్న నిర్ణయానికి వచ్చారు. ఈ పరిస్థితిలోనే తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సహకార అభివృద్ధి సంస్థ దళితులకు ఉపాధి కల్పించే ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే అమల్లోవున్న పథకాలు కాకుండా కొత్త పథకాలపైనా అధ్యయనం చేస్తోందని తెలుస్తోంది.