రాష్ట్రీయం

22న నిరుద్యోగ ర్యాలీ ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: ‘తెలంగాణలో విలువలతో కూడిన రాజకీయ పార్టీ అవసరం ఉంది..’ అని తెలంగాణ జెఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండ రామ్ అన్నారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు కల్పించినా 22న టి.జాక్ అధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు నిరుద్యోగ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ర్యాలీ సందర్భంగా ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్‌కు ప్రొఫెసర్ కోదండరామ్ హాజరయ్యారు. యూనియన్ నాయకుడు కప్పెర హరిప్రసాద్ సంథానకర్తగా వ్యవహారించిన కార్యక్రమంలో అనేకానేక ప్రశ్నలకు కోదండరామ్ ఘాటైన సమాధానలిచ్చారు. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేస్తున్నారా? అని ప్రశ్నించగా, నైతిక విలువలతో కూడిన రాజకీయ పార్టీ ఆవిర్భవించాల్సి ఉందని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే పార్టీ రావాల్సి ఉందని ప్రజలు ఆశిస్తున్నారని చెప్పారు. టి జాక్ రాజకీయ పార్టీగా ఆవిర్భవించదని, విలువలతో కూడిన పార్టీ ఏదైనా ఆవిర్భవిస్తే ఆ పార్టీతో కలిసి పని చేసే విషయం ఆలోచిస్తామని మరో ప్రశ్నకు సమాధాననిచ్చారు. టి-జాక్ ఎప్పుడూ ఉండాల్సిందేనని, తాను వేరే పార్టీలో చేరినా జెఏసి కొనసాగుతుందని వివరించారు.
ప్రభుత్వ అసహనం
నిరుద్యోగ నిరసన ర్యాలీకి అనుమతి కోరుతూ ఈ నెల 1న నగర పోలీసు కమిషనర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చానని, కమిషనర్ దానిని సెంట్రల్ జోన్ డిసిపికి పంపించారన్నారు. డిసిపి అనుమతిస్తారన్న నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వం అసహనంతో ఉన్నదని, ఉపయోగిస్తున్న భాష మాటల్లో చెప్పలేనన్నారు. ర్యాలీకి హాజరయ్యే వారు సంయమనంతో ఉండాలని కోరారు. ర్యాలీలో పాల్గొన్న వారిపై లాఠీచార్జి, కాల్పులు జరుగుతాయంటూ భయోత్పాతం సృష్టించే ప్రయత్నం జరుగుతున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టకు పోరాదని సూచించారు. లక్షా 7 వేల ప్రభుత్వ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ, వీటికి కమల్‌నాథన్ కమిటీతో సంబంధం లేదన్నారు.
కెసిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు
సిఎం కెసిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గత అనుబంధం మేరకు ఫోన్‌లో చెప్పారా? అని ప్రశ్నించగా, ఆ విధంగా చెప్పలేనన్న విషయం మీకూ తెలుసునని ఆ విలేఖరిని ఉద్దేశించి నవ్వుతూ అన్నారు. సిఎం కెసిఆర్ జన్మదినం సందర్భంగానైనా నిరుద్యోగులకు ఉద్యోగ నియామకాల కానుక ప్రకటించాలని కోరారు. మీ వెనుక ఎవరో అదృశ్యశక్తులు ఉండి నడిపిస్తున్నారన్న ప్రశ్నకు స్పందిస్తూ టి.జాక్ స్వతంత్ర సంస్ధ అని, స్టీరింగ్ కమిటీ ఉందని, ఎవరూ నడిపించాల్సిన అవసరం లేదన్నారు. తనను అవమానిస్తే భరిస్తాను కానీ నిరుద్యోగులను రెచ్చగొట్టవద్దని కోరారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాలకూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు అనేక మంది తన దృష్టికి తెచ్చారని ఆయన చెప్పారు. ప్రభుత్వం నిబద్ధతతో పని చేయాలని కోరారు. గ్యాంగ్‌స్టర్ నరుూం డైరీ పెట్టాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. నరుూం కేసులో ఉన్న వారిని కఠినంగా శిక్షించాల్సిందేనన్నారు.
సిఎం కాన్వాయ్‌తో ట్రాఫిక్ జామ్
సిఎం కెసిఆర్ కాన్వాయ్ కోసం రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్ నిలిపి వేయడం భావ్యం కాదన్నారు. మరోవైపు విఐపి కాన్వాయ్‌ల కోసం రోడ్డు ఖాళీగా పెట్టిన సమయంలో పాదాచారులు తెలిసో, తెలియకో రోడ్డు దాటుతుంటే ప్రమాదాలు జరిగి మరణించిన దాఖలాలు తాజాగా అనేకం ఉన్నాయని, దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. స్థానిక రిజర్వేషన్ల మార్పుపై చర్చ జరగాల్సి ఉందని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కార్యక్రమంలో టి.జెఎసి వైస్-చైర్మన్ ప్రహ్లాద్, జర్నలిస్టు యూనియన్ నాయకుడు ప్రభాకర్, స్వామి ప్రభృతులు పాల్గొన్నారు.