రాష్ట్రీయం

బడ్జెట్‌లో రూ.30 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: దేశం కోసం సైనికులు, సమాజం కోసం జర్నలిస్టులు చేస్తున్న కృషికి ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకుంటుందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. ఏటా జర్నలిస్టుల సంక్షేమానికి కేటాయించే నిధులను ఈసారి బడ్జెట్‌లో మూడు రెట్లు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే రూ.10 కోట్ల చొప్పున రెండేళ్లుగా సంక్షేమ నిధికి జమ చేశామని, ఈసారి బడ్జెట్‌లో రూ.30 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. తన 63వ జన్మదినం పురస్కరించుకుని ప్రగతి భవన్‌లో శుక్రవారం మరణించిన జర్నలిస్టు కుటుంబాలతో సమావేశమై జనహిత కార్యక్రమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ శ్రీకారం చుట్టారు. మరణించిన జర్నలిస్టుల ఒక్కో కుటుంబానికి లక్ష చొప్పున సిఎం ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ ఏ ఆధారంలేని జర్నలిస్టు కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని, మరణించిన జర్నలిస్టు కుటుంబాల్లో పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లలుంటే వారి వివాహాలకు రూ. 3లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబానికి ఇళ్లులేని వారికి వారి సొంత జిల్లాల్లో వెంటనే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. రాష్టవ్య్రాప్తంగా 20 వేలమంది జర్నలిస్టులకు ఎక్కడికక్కడై ఇళ్ళ స్థలాలు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. జర్నలిస్టుల పరిస్థితి పైన పటారం లోన లోటారంలా ఉందని, తమ ప్రభుత్వం వారి సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుందని ప్రకటించారు. జర్నలిస్టులకు ఏవైనా ఆర్థికభారమైన ఆరోగ్య సమస్యలుంటే ప్రెస్ అకాడమీ ద్వారా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. మరణించిన జర్నలిస్టు కుటుంబాలతో ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ జర్నలిస్టుల సంక్షేమం కోసం చేస్తున్న కృషిని సిఎం అభినందించారు.

చిత్రం..జర్నలిస్ట్ కుటుంబాలకు లక్ష రూపాయల చెక్కులు అందిస్తున్న సిఎం కెసిఆర్