రాష్ట్రీయం

సూపర్ పోలీస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: రాష్ట్ర పోలీసు శాఖ శుక్రవారం ఒకే రోజు 10,442 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగ నియామకాలు చేపట్టి రాష్ట్ర పోలీసుశాఖ చరిత్ర సృష్టించిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అభినందించారు. ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందుకోనున్న వారిలో సివిల్, టిఎస్‌ఎస్‌పి, ఎస్‌పిఎఫ్‌లకు చెందిన పోలీస్ కానిస్టేబుల్స్ ఉండగా వీరిలో 1130 మంది మహిళ కానిస్టేబుల్స్ ఉన్నారు. తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు రాష్టవ్య్రాప్తంగా 11,281 పోలీస్ కానిస్టేబుల్స్ నియామకానికి 31 డిసెంబర్, 2015న నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో ఎస్‌సిటి కానిస్టేబుల్స్ (సివిల్/ఎఆర్), ఎస్‌సిటి కానిస్టేబుల్స్ (ఎస్‌ఎఆర్ సిపిఎల్/టిఎస్‌ఎస్‌పి) ఎస్‌పిఎఫ్, ఫైర్ మెన్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ నియామకాలకు హాజరైన వారిలో 81,357 మంది అభ్యర్థులు భౌతిక పరీక్షలో అర్హత పొందగా వ్రాత పరీక్షకు 81,070 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కట్ మార్కుల అనంతరం ఇచ్చిన ర్యాంక్‌లతో ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచినట్టు డిజిపి అనురాగ శర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఇచ్చిన పోస్టింగ్‌లు, యూనిట్‌ల వారీగా ఈ నెల 20 నుంచి వెబ్‌సైట్‌లో పెట్టనున్నట్టు డిజిపి పేర్కొన్నారు. ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులు సమర్పించే ఒర్జినల్ సర్ట్ఫికేట్లు, మెడికల్ టెస్ట్‌ల ఆధారంగా తుది నియామకాలు జరుగుతాయని డిజిపి పేర్కొన్నారు.
ఎస్‌సిటి సివిల్ పోలీస్ కానిస్టేబుల్స్ నియామకానికి 2108 పోస్టుల భర్తీకి నోటిఫై చేయగా 2102 మంది ఎంపిక కాగా వీరిలో 637 మంది మహిళలు ఉన్నారు. ఎస్‌సిటి ఎఆర్ కానిస్టేబుల్స్ 4462 పోస్టుల భర్తీకి నోటిఫై చేయగా 3346 మంది ఎంపిక కాగా వీరిలో 387 మంది మహిళలు ఉన్నారు. ఎస్‌సిటి కానిస్టేబుల్ (మెన్) 4065 పోస్టుల భర్తీకి నోటిఫై చేయగా 4029 మంది ఎంపికయ్యారు. ఎస్‌పిఎఫ్ కానిస్టేబుల్స్ 174 పోస్టుల భర్తీకి నోటిఫై చేయగా 170 మంది ఎంపికయ్యారు. ఫైర్ మెన్ పోస్టులు 416 భర్తీకి నోటిఫై చేయగా 410 మంది ఎంపికయ్యారు. ఎస్‌సిటి కానిస్టేబుల్స్ (ఎస్‌ఎఆర్ సిపిఎల్-మెన్) పోస్టులు 56 భర్తీకి నోటిఫై చేయగా అన్ని పోస్టులకు ఎంపికయ్యారు. మొత్తంగా 11,613 పోస్టుల భర్తీకి నోటిఫై చేయగా 10,442 మంది ఎంపిక కాగా ఇందులో 1130 మంది మహిళలు ఉన్నారని డిజిపి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.