రాష్ట్రీయం

సామాజిక అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (నాగార్జున యూనివర్సిటీ), జనవరి 6: సామాజిక అవసరాలకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు జరగాల్సిన అవసరముందని రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘అడ్వానె్సస్ ఇన్ ప్లాంట్ ఆండ్ మైక్రోబ్ రీసెర్చ్’ అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వర్సిటీ ఇన్‌చార్జి వీసీ ఆచార్య విఎస్‌ఎస్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్‌లో వనరులు పుష్కలంగా ఉన్నాయని, వాటిని సంరక్షించి రాష్ట్భ్రావృద్ధికి వినియోగించుకోడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రానికీ లేని సముద్రతీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌కు ఉందని, ఇది ఆంధ్రప్రదేశ్‌కు లభించిన వరంగా భావించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ తీర ప్రాంతాలలో ఉన్న సహాజవనరులను, మడ అడవులను సంరక్షించుకోడానికి చర్యలు చేపడుతున్నామని, దీనిలో భాగంగానే అంతర్జాతీయ స్థాయిలో మడ అడవులపైన పరిశోధన చేస్తున్న వారి సలహాలు, సూచనలు తీసుకోనున్నట్లు తెలిపారు. నేడు పర్యావరణం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ పరిష్కార మార్గాలు కనుగొనాల్సిన బాధ్యత పరిశోధకులపైన ఉందని అన్నారు. అధ్యక్షత వహించిన ఆచార్య విఎస్‌ఎస్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఒకే అంశంపై జరుగుతున్న పరిశోధనలపై అవగాహాన పొందడానికి ఇటువంటి సదస్సులు దోహాదపడతాయని తెలిపారు. హైదరాబాద్ వర్సిటీ వీసీ పి అప్పారావు మాట్లాడుతూ వ్యవసాయంలో రసాయన ఎరువులను వినియోగించటం ద్వారా అనేక దుష్పలితాలు కలుగుతున్నాయని, దానిని నివారించడానికి సేంద్రీయ ఎరువులతోపాటు, జీవ ఎరువులను వినియోగించుకోవాల్సిన అవసరముందని అన్నారు. సెమినార్ డైరక్టర్ ఆచార్య జి రోశయ్య మాట్లాడుతూ వర్సిటీ బోటనీ విభాగం మిగిలిన విభాగాలకు ఆదర్శంగా నిలుస్తుందని, అడ్వాన్స్ ప్లాంట్ రీసెర్చ్ అంశంపై జరుగుతున్న ఈ సదస్సులో నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, మెక్సికో, జర్మనీ దేశాలతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 400 మంది శాస్తవ్రేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు పాల్గొంటున్నారని తెలిపారు. అనంతరం సదస్సు అబ్‌స్ట్రాక్ట్ బుక్‌ను మంత్రి పుల్లారావు, వీసీలు విఎస్‌ఎస్ కుమార్, పి అప్పారావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామకృష్ణ, వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య పి రాజశేఖర్, నెదర్లాండ్స్‌కు చెందిన ఆచార్య రమేష్ జె గులాటీ, మెక్సికోకు చెందిన ఎస్‌ఎస్‌ఎస్ శర్మ, ఎస్ నందినీ, ఆస్ట్రేలియాకు చెందిన ఆచార్య మేఘ్‌రాజ్, నేచురల్‌సైన్స్ డీన్ ఆచార్య విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మీకు అండగా ఉంటా
రైతు, చేనేత కుటుంబాలకు జగన్ భరోసా
ధర్మవరం రూరల్, జనవరి 6: మన ప్రభుత్వం వస్తుంది... అధైర్యపడి ఎవరూ ఆత్మహత్యకు పాల్పడి కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసుకోవద్దని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో బుధవారం రైతు, చేనేతల భరోసాయాత్ర చేపట్టిన జగన్ రెండు చేనేత, ఒక రైతు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రైతు, చేనేతలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసి ఆదుకుంటామని హామీనిచ్చారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతులు, చేనేతలు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటుంటే ప్రభుత్వం సకాలంలో స్పందించడం లేదన్నారు. రైతు కుటుంబాలను ఆదుకోకపోవడంతో వారు దుర్భరజీవితం గడుపుతున్నారన్నారు. కుటుంబ పెద్దను కోల్పయిన వారిని ఓదార్చేందుకే తాను ఈ యాత్ర చేపట్టానన్నారు. బాధిత కుటుంబాలకు పార్టీ ఎళ్లకాలం అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విశ్వ, మాజీ ఎంపి అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా యువజనోత్సవాలు
భద్రాచలం, జనవరి 6: రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలు గోదావరి లోయ ఖమ్మం జిల్లా భద్రాచలంలో బుధవారం ఘనంగా ముగిశాయి. మూడు రోజుల పాటు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన యువ కళాకారుల ప్రదర్శనలతో శ్రీ రామదివ్యక్షేత్రం హోరెత్తింది. ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర యువజన క్రీడల సర్వీసుల శాఖ కమిషనర్ ఎంఎ అజీం, ఐటీడీఏ పీవో రాజీవ్‌గాంధీ హన్మంతు, ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, సున్నం రాజయ్య, సర్పంచి భుక్యా శే్వత, జడ్పీటీసీ గోడేటి రవి పాల్గొన్నారు. మూడురోజుల పాటు 18 అంశాల్లో నిర్వహించిన పోటీల్లో 945 మంది యువతీ యువకులు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. 10 జిల్లాల నుంచి పాల్గొన్న ఈ ఉత్సవాల్లో హైదరాబాద్ అత్యధికంగా 17 బహుమతులు గెలుచుకుని అగ్రస్థానంలో నిలవగా ఖమ్మం 7 బహుమతులతో ద్వితీయ, వరంగల్ 5 బహుమతులతో తృతీయస్థానంలో నిలిచాయి. ఈ ఉత్సవాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్న కళాకారులతో ఈ నెల 12వ తేదీన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయపూర్‌లో జరిగే జాతీయ యువజనోత్సవాలకు రాష్ట్ర జట్టును పంపుతామని కమిషనర్ అజీం ప్రకటించారు.
పశువైద్యుల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం
ఆలమూరు, జనవరి 6: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పశువైద్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని, త్వరలో భర్తీచేస్తామని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ జి సోమశేఖర్ తెలిపారు. రాష్ట్రంలో 250 పశు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉంన్నాయని, అందులో 150 భర్తీచేయాలని నిర్ణయించామన్నారు. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం సంధిపూడిలో బుధవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. పెయ్యి దూడలను అభివృద్ధిపర్చడంలో భాగంగా ఇతర దేశాల నుండి పశువులకు వీర్యం తీసుకువస్తున్నామన్నారు. స్మెర్మ్‌టెక్నాలజీ ఉపయోగించడంవల్ల 90 శాతం పెయ్యి దూడలు పుడతాయని వివరించారు. రాష్ట్రంలో మొత్తం మూడు వేల పశువైద్యశాలు ఉండగా, 986 వైద్యశాలలకు సొంత భవనాలు ఉన్నాయన్నారు. మిగిలిన వాటికి భవనాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. పశుగ్రాస భద్రతా పథకంలో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పశుగ్రాస నిల్వకేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 25వేల మెట్రిక్ టన్నులు నిల్వ ఉంచిన్నట్లు తెలిపారు. ఈ విధానం ద్వారా రాయలసీమలో ఎక్కువగా నిల్వ ఉంచుతామన్నారు. అలాగే పశువుల వసతి గృహాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కాకినాడ, కర్నూలు, ఒంగోలు, పశ్చిమ గోదావరి జిల్లా తడికలపూడి గ్రామాల్లో వీటిని నిర్మిస్తున్నట్లు సోమశేఖర్ తెలిపారు.
బంగ్లా పౌరుడికి సహకరించినందుకు అరెస్టు
కలికిరి, జనవరి 6: గత కొంతకాలంగా చిత్తూరు జిల్లా కలికిరి పట్టణంలో అనధికారికంగా నివాసముంటున్న బంగ్లాదేశీయుడిని ఈనెల 3న చిత్తూరు క్రైమ్‌బ్రాంచి పోలీసులు అరెస్టుచేశారు. అతను ఇండియాలో ఉంటున్నట్లు ఆధార్‌కార్డులు, పాన్‌కార్డులు ఇప్పించడంలో సహకరించిన నలుగురు వ్యక్తులను బుధవారం కలికిరి ఎస్‌ఐ పురుషోత్తంరెడ్డి అరెస్టు చేశారు. ఈమేరకు వాల్మీకిపురం సిఐ శ్రీ్ధర్‌నాయుడు బుధవారం కలికిరి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. గత ఏడాదికాలంగా బంగ్లాదేశీయుడు షేక్ మహ్మద్‌జమీల్(35) చిత్తూరుజిల్లా కలికరి క్రాస్‌రోడ్డులోని మదరసాలో పనులు చేసుకుంటు ఉంటున్నాడు. ఇతనికి పుంగనూరు పట్టణం సుబేదార్‌వీధికి చెందిన వి.అహ్మద్‌బాష(35), కలికిరి పట్టణంలో జెరాక్స్ సెంటర్ నడుపుకుంటున్న అప్పినేపల్లె ప్రసాద్(42), పీలేరు పట్టణం మసీదువీధిలో ఇంటర్నెట్ సెంటర్ నడుపుకుంటున్న శివ(27), అజక్ అహ్మద్(25) సహకరించి పాన్‌కార్డులు, ఆధార్‌కార్డులు వచ్చేలా చేశారు. ఈ విషయం పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. వీరిని అరెస్టుచేసి వాల్మీకిపురం కోర్టుకు హాజరు పరిచినట్లు సిఐ శ్రీ్ధర్‌నాయుడు వెల్లడించారు.
వాగులు, వంకల్లోని ఇసుక స్థానికులకే!
జంగారెడ్డిగూడెం, జనవరి 6: వాగులు, వంకల్లోని ఇసుక స్థానికులకే ఉచితంగా కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ, భూగర్భ గనుల శాఖ మంత్రి పీతల సుజాత వెల్లడించారు. ప్రజలకు ఇసుక కొరత లేకుండా నూతన సంవత్సరంలో కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకువస్తుందన్నారు. ఇసుక ప్రజలందరికీ అందేలా చేయడం, అందుబాటు ధరలో ఉండేలా చేయడం, పర్యావరణాన్ని కాపాడటం, అక్రమ రవాణా అరికట్టడం వంటి నాలుగు ఉద్దేశాలు నెరవేరేలా నూతన పాలసీ ఉండబోతోందన్నారు. ఇందులో భాగంగానే వాగులు, వంకల్లోని ఇసుక ఉచితంగా స్థానికులకే కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారన్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని 20వ వార్డులో బుధవారం జరిగిన జన్మభూమి-మావూరు కార్యక్రమంలో ప్రసంగిస్తూ మంత్రి సుజాత ఈ వివరాలు తెలిపారు. వాగులు, వంకల్లోని ఇసుక రెండు ఎడ్లబండ్లపై స్థానికులు రవాణా చేసుకునే విధంగా ఫిబ్రవరి 1 నుండి ప్రకటించే నూతన విధానం ఉండబోతోందన్నారు. ఇసుక కొరత వల్ల నిర్మాణాలు ఆగిపోరాదనే ముఖ్యమంత్రి ఇసుకపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి సుజాత చెప్పారు.
నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
తిరుచానూరు, జనవరి 6: తిరుపతి రూరల్ పరిధిలోని తుమ్మలగుంటలో ఆట్లాడుకుంటూ వెళ్లిన పునీత్(3), సాయి(4) నీటి కుంటలో పడి మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. పునీత్ తండ్రి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం పునీత్‌ను ఆమె అవ్వ తిరుపతికి తీసుకువచ్చింది. ఈ సందర్భంగా పునీత్ ఆటాడుకుంటూ తనకు అన్న వరుస అయిన సాయితో వెళ్లి నీటికుంటలో పడి మృతి చెందాడు. కాగా సాయి తండ్రి గేట్ కాలేజీలో పనిచేస్తున్నారు. దీనితో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అక్కడికి వెళ్లి ఆ కుటుంబాన్ని ఓదార్చారు. దీనిపై కేసు పెట్టడానికి కుటుంబ సభ్యులు నిరాకరించారు.
గ్రామస్థాయి నుంచి బిజెపి బలోపేతం
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, జనవరి 6: రాష్ట్ర విభజన అనంతరం లోటుబడ్జెట్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేసేందుకు గత ఏడాది 13,517 కోట్ల రూపాయల మేర కేంద్రం సాయం అందించినట్టు బిజెపి జాతీయ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి సిద్ధార్‌నాథ్ సింగ్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గత ఏడాది కంటే 73 శాతం అధికంగా నిధులు విడుదల చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నిర్ణయం తీసుకున్నారని బుధవారం శ్రీకాకుళంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన చెప్పారు. గ్రామ స్థాయి నుంచే బిజెపిని మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసి, ఆ మేరకు పనిచేస్తున్నామని తెలిపారు. 2014 ఎన్నికల అనంతరం గ్రామస్థాయి నుండి పార్టీని బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 18 నెలల పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి వాటిని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పలు జాతీయ విద్యా సంస్థలు, నూతన పరిశ్రమలు, అధునాతనమైన భవంతుల నిర్మాణాలు, నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు మంజూరు వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వ సహాయ, సహకారాలు పూర్తిస్థాయిలో అందజేస్తున్నట్టు చెప్పారు.

విజయవాడ కేంద్రంగా
జూన్ నుంచి పాలన
చిల్లకూరు, జనవరి 6: ఈ ఏడాది జూన్ నుండి విజయవాడ నుండే పరిపాలన సాగిస్తామని మంత్రి పి నారాయణ తెలిపారు. బుధవారం నెల్లూరు జిల్లా చిల్లకూరు మండల కేంద్రంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త నానాజీ నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ ముందుగా అనుకున్న ప్రకారం జూన్ నుండి విజయవాడలోనే తాత్కాలిక సచివాలయం ద్వారా పాలన సాగిస్తామన్నారు. అందుకు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపగా వారు ఆమోదం తెలిపారన్నారు. ఇందుకు సంబంధించి త్వరలో జి ప్లస్-1 నిర్మాణాలు చేపట్టి ఉద్యోగులకు వసతి గృహాలు, కార్యాలయాల సముదాయాలను తాత్కాలికంగా ఏర్పాటు చేస్తామన్నారు. 29 గ్రామాల నుండి ప్రజలు 33 వేల ఎకరాల భూములను ఇచ్చారన్నారు. వారందరికీ రాజధాని ప్రాంతంలో ఇళ్లస్థలాలు ఇస్తామన్నారు. ఇందుకు సంబంధించి అన్ని గ్రామాల్లో 33 వేల కిలో మీటర్ల రోడ్డు వివిధ శాఖల పరిధిలో నిర్మిస్తామన్నారు. ఇందులో 3 కిలో మీటర్ల రోడ్డు పెండింగ్‌లో ఉందని, ఇది కూడా సంబంధిత రైతులతో చర్చలు జరిపి రోడ్డు భూములను తీసుకుంటామన్నారు. దీనిపై ప్రతి పక్షాలు రాద్ధాంతాలు చేస్తున్నాయని, ఆ పద్ధతి మానుకోవాలన్నారు.

మావోల చేతిలో
మాజీ సర్పంచ్ హతం
గూడెంకొత్తవీధి, జనవరి 6: విశాఖ ఏజన్సీ గూడెంకొత్తవీధి మండలంలో బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడంటూ చింతపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, మాజీ సర్పంచ్ వెంకటరమణను మావోయిస్టులు హత్య చేశారు. మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో 40 మంది సాయుధులైన మావోయిస్టులు, సుమారు 300 మంది సానుభూతి పరులతో కలిసి జెర్రెల గ్రామానికి చేరుకుని, ఇంటిలో నిద్రిస్తున్న మాజీ సర్పంచ్ సాగిన వెంకటరమణ, అతని సోదరుడు మురళీకృష్ణను అదుపులోకి తీసుకుని గ్రామ నడిబొడ్డుకు తీసుకువచ్చారు. చేతులు వెనక్కి కట్టేసి వెంకటరమణను దూరంగా తీసుకెళుతుండగా, అప్పటికే అక్కడికి చేరుకున్న గ్రామస్థులు అడ్డుకునే ప్రయత్నం చేసారు. అయితే వారిని వారించిన మావోయిస్టులు.. వెంకటరమణ బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా వ్యవహిరిస్తున్నాడని ఆరోపిస్తూ గొడ్డలితో నరికి అతడిని హతమార్చారు. బాక్సైట్‌కు అనుకూలంగా ఎవరు వ్యహరించినా ఇదే గతి పడుతుందని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతకు ముందు వెంకటరమణ ఇంటికి నిప్పంటించి తగులబెట్టారు.

రౌడీలను ఏరేస్తాం: బొజ్జల
రొంపిచెర్ల, జనవరి 6 : తెలుగుదేశం పార్టీకి రచ్చ, దొంగసారా, రౌడీయిజం తెలియదని, రౌడీయిజం చేసేవాళ్లని ఏరిపారేస్తామని రాష్ట్ర అటవీశాఖమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలంలోని పెద్దమల్లెల గ్రామం నండింపల్లెలో బుధవారం జరిగిన జన్మభూమి-మా ఊరు గ్రామసభలో మంత్రి బొజ్జల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రతిపక్షం తీరు బాగాలేదని, కొంతమంది రౌడీయిజం చేస్తున్నారని అన్నారు.

8న సిపిఐ వార్షికోత్సవాల ముగింపు
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, జనవరి 6: సిపిఐ 90వ వార్షికోత్సవాలు దేశవ్యాప్తంగా జరిగాయని, జనవరి 8న ముగింపు ఉత్సవాలు గుంటూరులో నిర్వహించనున్నట్లు రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. గుంటూరు మల్లయ్యలింగం భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ, శుక్ర, శని, ఆదివారాల్లో ముగింపు ఉత్సవాలు జరుగుతాయని, ఈ ఏడాదిని పార్టీ నిర్మాణ సంవత్సరంగా ప్రకటించామన్నారు. హిమని గార్డెన్స్‌లో జరిగే బహిరంగ సభకు ఎబి బర్దన్ పేరు పెట్టామన్నారు. గడిచిన 50 ఏళ్ల కాలంలో బర్దన్ లేకుండా నిర్వహిస్తున్న జాతీయ సమితి సమావేశం ఇదే నన్నారు. ముంగిపు సమావేశాలకు జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, జాతీయ ఉప ప్రధానకార్యదర్శి గురుదాస్ గుప్తా, కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు బి రాజా, అమర్‌జిత్ కౌర్, షమీమ్ ఫైజీ, కె నారాయణ, ఫణియన్ రవీంద్రన్, రామేంద్రకుమార్, కేంద్ర నియంత్రణ కమిషన్ చైర్మన్ ఈడ్పుగంటి నాగేశ్వరరావు తదితరులు హాజరు కానున్నట్లు తెలిపారు. దేశంలో నెలుకొన్న పరిస్థితులపై చర్చించటం జరుగుతుందన్నారు. కాంగ్రెసుపార్టీ పాలన కంటే భిన్నమైన పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చినా బిజెపి కాంగ్రెసు విధానాలను అనుసరిస్తోందని కేంద్ర ఆర్థికమంత్రి ఆరుణ్‌జైట్లీ స్వయంగా ఒప్పుకున్నారన్నారు. ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానాలను సమిక్షించేందుకు ఇదే సరైన సమయమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలు, సిపిఐ చేపట్టిన పొరాటాలు ప్రత్యేకించి జాతీయ సమితి దృష్టికి తీసుకు వెళ్తామన్నారు.

మావోల భయం
జన్మభూమి వేదిక పక్క జిల్లాకు మార్పు
కొయ్యూరు, జనవరి 6: విశాఖ ఏజెన్సీలోని కొయ్యూరు మండలంలో నిర్వహించాల్సిన జన్మభూమి సభను పోలీసు హెచ్చరికల నేపథ్యంలో సమీపంలోని తూర్పుగోదావరి జిల్లా వై రామవరం మండలంలో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జికె వీధి మండలంలోని జెర్రెల గ్రామ మాజీసర్పంచ్, చింతపల్లి ఎఎంసి డైరెక్టర్ వెంకటరమణను మావోయిస్టులు మంగళవారం రాత్రి హతమార్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కొయ్యూరు మండలం యు.చీడిపాలెం పంచాయతీ పలకజీడి గ్రామంలో బుధవారం జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు స్థానికంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరుణంలో అంత మారుమూల గ్రామంలో సభ వద్దని పోలీసులు హెచ్చరించారు. దీంతో ప్రత్యామ్నాయంగా దగ్గర్లోని తూర్పుగోదావరి జిల్లా వై రామవరం మండలం జంగాలతోటలో కార్యక్రమాన్ని నిర్వహించారు. గట్టి పోలీసు బందోబస్తు మధ్య ఈ కార్యక్రమం జరిగింది.