రాష్ట్రీయం

ప్రచారం జాస్తి సంక్షేమం నాస్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 17: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారానికి ఇస్తున్న ప్రాముఖ్యత ప్రజల సంక్షేమానికి ఇవ్వటం లేదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి రాఘవులు విమర్శించారు. సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో జరుగుతున్న మహాజన పాదయాత్ర ఖమ్మం చేరుకున్న సందర్భంగా శుక్రవారం స్థానిక పెవిలియన్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చెప్పిన మాట చెప్పకుండా, చెప్పిన పని చేయకుండా ముఖ్యమంత్రి కెసిఆర్ మాటలతోనే కాలం వెళ్లబుచ్చారన్నారు. రెండేళ్ళ క్రితం ధనిక రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ ధైర్యం చేయలేకపోతున్నారన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ తీరు కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదన్నారు. గడిచిన 70ఏళ్ళలో ఏ ప్రధానమంత్రి చేయని విదేశీ పర్యటనలు రెండున్నరేళ్ళ కాలంలో మోదీ చేశారన్నారు. నోట్లరద్దు తర్వాత సామాన్య ప్రజలే ఇబ్బందులు పడ్డారని, ఎక్కడా డబ్బున్న పెద్దలు బ్యాంకులకు వెళ్ళిన జాడ లేదన్నారు. సిపిఐ జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, పాదయాత్ర రథసారథి తమ్మినేని వీరభద్రం, తదితరులు ప్రసంగించారు.