రాష్ట్రీయం

ఆంధ్రా ప్రవేశపరీక్షల షెడ్యూలు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపరీక్షల షెడ్యూలు ఖరారు చేసినట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ డాక్టర్ ఎస్ విజయరాజు తెలిపారు. ప్రవేశపరీక్షల తేదీలు, చైర్మన్లు, కన్వీనర్లను ఖరారుచేశామని ఆయన శుక్రవారం చెప్పారు. పిజిఇసెట్ మినహా అన్ని ప్రవేశపరీక్షలకు ఏప్రిల్‌లో నోటిఫికేషన్లు ఇస్తామని పేర్కొన్నారు. ఎపి ఇసెట్ నోటిఫికేషన్‌ను 19న , ఐసెట్ నోటిఫికేషన్‌ను 27న, పిజి ఇసెట్ నోటిఫికేషన్ మార్చి 1న, పిఇసెట్ నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 20న విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఎమ్సెట్ నోటిఫికేషన్‌ను 8న, లాసెట్ నోటిఫికేషన్‌ను 12న జారీ చేశామని ఆయన చెప్పారు. ఇసెట్ దరఖాస్తులను 27నుండి మార్చి 30 వరకు, అపరాధ రుసుంతో ఏప్రిల్ 20 వరకూ స్వీకరిస్తామని పేర్కొన్నారు. మే 3న ఆన్‌లైన్ పరీక్ష జరుగుతుంది. ఐసెట్ దరఖాస్తులు మార్చి 1 నుండి ఏప్రిల్ 5 వరకు, జరిమానాతో26 వరకూ స్వీకరిస్తామని చెప్పారు. ఎపిపిజిఇసెట్‌కు మార్చి 3 నుండి దరఖాస్తులు ఏప్రిల్ 6 వరకూ స్వీకరిస్తామని, జరిమానాతో ఏప్రిల్ 28 వరకూ స్వీకరిస్తామని చెప్పారు. ఎపి ఎడ్‌సెట్‌కు ఈనెల 22 నుండి మార్చి 22 వరకు, జరిమానాతో ఏప్రిల్ 15 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తామని, పరీక్ష ఏప్రిల్ 19న జరుగుతుందని అన్నారు. ఎపి లాసెట్‌కు ఫిబ్రవరి 18 నుండి మార్చి 18 వరకు, జరిమానాతో ఏప్రిల్ 17 వరకూ దరఖాస్తులను అనుమతిస్తామని, పరీక్ష ఏప్రిల్ 19న జరుగుతుందని వివరించారు. ఎపిపిఇసెట్‌కు మార్చి 8 నుండి ఏప్రిల్ 7వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తామని, జరిమానాతో ఏప్రిల్ 14 వరకూ అనుమతిస్తామని, పరీక్ష మే 1న జరుగుతుందని వివరించారు. అన్ని ప్రవేశపరీక్షలకు వెబ్‌పోర్టల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఎపి ఎమ్సెట్‌కు ప్రొఫెసర్ సిహెచ్ సాయిబాబు, పిఇసెట్‌కు ప్రొఫెసర్ పి ఆర్ భానుమూర్తి, ఐసెట్‌కు ప్రొఫెసర్ బి సుధీర్, పిజిఇసెట్‌కు ప్రొఫెసర్ పి ఎస్ అవధాని, ఎడ్‌సెట్‌కు ప్రొఫెసర్ రంగనాథన్, లాసెట్‌కు ఆర్ జి బి భగవంత్ కుమార్, పిఇసెట్‌కు జాన్సన్‌లు కన్వీనర్లుగా వ్యవహరిస్తారు.