రాష్ట్రీయం

నిరుద్యోగ ర్యాలీకి భారీ జన సమీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: తెలంగాణ జెఎసి ఆధ్వర్యంలో ఈ నెల 22న నిర్వహిస్తున్న నిరుద్యోగుల ర్యాలీకి రాష్ట్రం నలుమూలల నుండి వేలాది మంది విద్యార్థులు కదిలి వస్తున్నారు. ముందస్తుగా నగరానికి చేరుకుని 22న ర్యాలీకి హాజరుకావాలని భావిస్తున్న విద్యార్థి నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. జోనల్ వ్యవస్థను రద్దుచేస్తేనిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని, అనేక సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని, అందుకే జోనల్ వ్యవస్థను రద్దు చేయకుండానే దానిని సవరించాల్సి ఉందని పేర్కొంటూ తెలంగాణ జాక్ ఈ ర్యాలీని నిర్వహిస్తోంది. ర్యాలీని భగ్నం చేసేందుకు పోలీసులు అప్పుడే తమ ప్రయత్నాలు ప్రారంభించారు. పోలీసుల దురుసుపై జాక్ నేత ప్రొఫెసర్ కోదండరామ్ తీవ్రంగానే స్పందించారు. ర్యాలీలో అశాంతి సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం విద్యార్థి, యువతకు ఇంటికో ఉద్యోగం, లక్ష ఉద్యోగ నియామకాలు చేపడతామని హామీ ఇస్తే టిఆర్‌ఎస్ పార్టీకి అధికారం కట్టబెట్టామని ఇచ్చిన హామీలు అన్నింటినీ గాలికొదిలి కల్లబొల్లి ముచ్చట్లు చెబితే వినిపించుకునే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు. మరోపక్క కోదండరామ్‌కు విద్యార్థి సంఘాల నుండి పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది. ఐదు విద్యార్ధి సంఘాలు శనివారం నాడు సమావేశమై అధికారికంగా మద్దతు ప్రకటించనున్నట్టు తెలిసింది.