రాష్ట్రీయం

శ్రీశైలంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, ఫిబ్రవరి 17: శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం స్వామివారికి ప్రత్యేక వాహనసేవలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహాగణపతిపూజ, చండీశ్వరునికి ప్రత్యేక పూజలు, కంకణపూజ, కంకణధారణ, రుత్విగహరణం, వాస్తుహోమం, కలశస్థాపన నిర్వహించారు. సాయంత్రం అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన, ధ్వజారోహణం గావించారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఆధ్వర్యం వహించాల్సిందిగా బ్రహ్మదేవుడు, స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవంలో కన్యాదానం చేసేందుకు మహావిష్ణువు, సర్వదేవతలకు చరాచరసృష్టికి ఆహ్వానం పలుకుతూ నందీశ్వరుడి చిత్రంతో కూడిన ధ్వజ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామి, అమ్మవార్లకు భృంగి వాహన సేవ నిర్వహిస్తారు. ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి భృంగివాహనంపై ఆశీనులను చేసి గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా ఈనెల 20 తేదీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 21వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చే భక్తులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పాతాళగంగ మార్గంలోని శివదీక్షా శిబిరాల్లో శివదీక్ష భక్తులకు 11 రోజుల పాటు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ ఉంటుంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారం అందిస్తారు.

చిత్రం..శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా
యాగశాలలో పూజలు చేస్తున్న అర్చక పండితులు