రాష్ట్రీయం

వేగంగా పెరుగుతున్న మధుమేహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 18: దేశ ప్రజలకు మధుమేహం ఆందోళన కలిగిస్తున్నది. యువతలో మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, అకాల భోజన అలవాట్లు, జంక్ ఫుడ్‌ను తీసుకోవడం, తగినంత వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల ఊబకాయం, మధుమేహం పెరుగుతున్నది. రెండు దశాబ్దాలుగా ఊబకాయం, మధుమేహం ఆందోళనకర స్థాయిలో సుమారు 50 శాతం వరకు పెరిగినట్లు, మధు మేహగ్రస్తులు 80 శాతం వరకు ఊబకాయంతో బాధపడుతున్నట్లు ఒక అంచనా. ఈ శతాబ్ద ప్రారంభంలో 31,705,000 ఉన్న మధుమేహ వ్యాధిగ్రస్తులు 2030 నాటికి వంద శాతం పెరిగి 79,441,000 మందికి చేరుకోనున్నట్లు అంచనా. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ అట్లాస్ 2015 ప్రకారం, 69.2 మిలియన్ల మంది భారతీయులు మధుమేహ వ్యాధిగ్రస్తులు. ఈ అంచనాల ప్రకారం మధుమేహం ఆందోళనకర స్థాయిలో రెట్టింపైంది. 15 ఏళ్ళలో ఈ పెరుగుదల వదం శాతం ఉంది. ఈ అంచనాల ప్రకారం 13.9 శాతం మధుమేహ వ్యాధిగ్రస్తులు 20 నుంచి 39 సంవత్సరాల మధ్య వయస్సు వారు ఉన్నారు. 40 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారిలో 50.2 శాతం, 60 సంవత్సరాల వయస్సు పైబడిన వారిలో 35.9 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నారు. మధుమేహం, ఊబకాయం సమస్యలతో బాధ పడుతున్న వారికి ‘బలియల్ ఇంటర్‌పొజిషన్, స్వీల్ విత్ లూప్ బైపార్టీషన్’ అనే శస్త్ర చికిత్స చేయడం ద్వారా రెండు రోజుల్లో ఏ విధంగా నయం అవుతుందో బేరియాట్రిక్, మెటబాలిక్ సర్జన్ డాక్టర్ సురేంద్ర ఉగాలే, అస్తెటిక్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శ్రీనివాస రావు సూరపనేని శనివారం విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. శస్త్ర చికిత్స గురించి ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదని వారు తెలిపారు.