ఆంధ్రప్రదేశ్‌

8న అక్షయ గోల్డ్ ఆస్తుల వేలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 18: భారీ సంఖ్యలో ప్రజలను మోసగించినందుకు గాను హైకోర్టు ఆదేశం మేరకు అక్షయ గోల్డ్ ఫామ్స్, విల్లాస్, కంపెనీకి చెందిన భూములు రూ.26 కోట్ల విలువైన స్థిరాస్తుల వేలానికి రాష్ట్ర సిఐడి విభాగం సన్నద్ధమైంది. ఈమేరకు వివరాలతో కూడిన ఓ నోటిఫికేషన్‌ను ఆదివారం విడుదల చేయనున్నారు. కర్నూలు, విశాఖ, ప్రకాశం, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో ఈ కంపెనీ ఆస్తులున్నాయని, ఈ ఆస్తులను ఈ నెల 20 నుంచి 27వ తేదీ లోపు పరిశీలించుకోవచ్చని తెలిపారు. నిర్ణీత విలువలో 10 శాతం సొమ్మును డిడి రూపంలో ఇఎండిగా అందజేయాల్సి ఉంటుంది. మార్చి 6వ తేదీలోపు ఇఎండితో సహా బిడ్స్‌ను దాఖలు చేయాలి. మార్చి 8న మధ్యాహ్నం 2.30 నిముషాలకు హైకోర్టులో బిడ్స్‌ను తెరుస్తారని సిఐడి అదనపు డిజిపి తెలిపారు. ఈ ఆస్తుల్లో రూ.2కోట్ల 78లక్షల విలువైన 1099 చ.గజాల ఖాళీ స్థలం విశాఖపట్టణం మహరాణిపేటలో ఉంది. ప్రకాశం జిల్లా పామూరు మండలం గుమ్మలంపాడు, వగ్గంపల్లి, అనంతపురం జిల్లా పెనుగొండ సబ్ డివిజన్ బోలెమర్రి, విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం ముంగ గ్రామంలో రూ. 6కోట్ల విలువైన 199 ఎకరాల భూములు, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో రూ. లక్షా 50 వేల విలువైన 528 గజాల స్థలం ఉన్నాయి.
రిమాండ్‌కు జడ్పీ సిఇఓ
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, ఫిబ్రవరి 18: ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించిన కేసులో ఏసిబి అధికారులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసిన నెల్లూరు జడ్పీ సి ఇ ఓ బి.రామిరెడ్డిని శనివారం నెల్లూరు ఏసిబి ప్రత్యేక కోర్టులో హజరుపర్చారు. న్యాయమూర్తి మార్చి 3వ తేది వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దర్యాప్తులో భాగంగా శనివారం కూడా రామిరెడ్డి ఇంట్లో సోదాలు కొనసాగాయి. నెల్లూరు ఏసిబి డిఎస్పీ తోట ప్రభాకర్, సి ఐ శివకుమార్‌రెడ్డి, ఎస్సై శ్రీహరి ఈ సోదాల్లో పాల్గొన్నారు.