ఆంధ్రప్రదేశ్‌

భృంగి వాహనంపై ఆది దంపతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, ఫిబ్రవరి 18: శ్రీశైలంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు శనివారం స్వామి అమ్మవార్లకు భృంగివాహన సేవ నిర్వహించారు. ఉదయం యాగశాలలో చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజలు, లోకకల్యాణం కోసం జపాలు నిర్వహించారు. మండపారాధనలు, పంచావర్ణ అర్చనలు, నిత్య హవనాలు, రుద్ర, చండీహోమం ఆగమ శాస్త్రానుసారం జరిపించారు. సాయంత్రం ప్రదోషకాల పూజలు, హోమాలు జరిపించి అనంతరం జపానుష్టానం నిర్వహించారు. సాయంత్రం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకరణ మండపంలో భృంగివాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహామంగళహారతి అనంతరం మేళతాళాల నడుమ ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం నిర్వహించారు. రాజగోపురం నుంచి క్షేత్ర ప్రధాన వీధుల గుండా ఈ గ్రామోత్సవం కొనసాగింది. ఈ కార్యక్రమంలో దేవాలయం కార్యనిర్వహణాధికారి నారాయణ భరత్ గుప్త, ఆలయ అధికారులు, అర్చక వేద పండితులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గ్రామోత్సవం ముందుభాగంలో దేవస్థానం వారు ఏర్పాటు చేసిన కోలాటాలు, డప్పు వాయిద్యాలు, విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం స్వామి, అమ్మవార్లకు హంసవాహన సేవ నిర్వహిస్తారు.
పట్టువస్త్రాలు సమర్పించిన
టిటిడి అధికారులు
శ్రీశైల మల్లికార్జునస్వామి, భ్రమరాంబిక అమ్మవార్లకు టిటిడి తరఫున శనివారం పట్టువస్త్రాలు సమర్పించారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టిటిడి ఇఓ సాంబశివరావు దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు అందజేశారు.
బ్రహ్మోత్సవాలకు శ్రీకాళహస్తి ముస్తాబు,
నేడు కన్నప్ప ధ్వజారోహణం
శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆదివారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అంకురార్పణగా ఆదివారం మధ్యాహ్నం భక్తకన్నప్ప ధ్వజారోహణం జరుగనుంది. భక్తుడైన కన్నప్పకు మొదటి పూజ జరిగిన తరువాత పరమశివుడి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం జరగడం ఆనవాయితీగా ఉంది. కన్నప్ప ధ్వజారోహణం కోసం దేవస్థానం సిబ్బంది ఏర్పాట్లుచేస్తున్నారు.

భృంగి వాహనంపై విహరిస్తున్న ఆది దంపతులు, శ్రీశైల మల్లన్నకు పట్టువస్త్రాలు సమర్పిస్తున్న టిటిడి ఇఓ సాంబశివరావు దంపతులు