ఆంధ్రప్రదేశ్‌

నిలిచిపోయిన డిఎడ్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 18: డిప్లమో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డి ఎడ్)లో రెండో ఏడాది పరీక్షల సమయానికి మొదటి సంవత్సరం పరీక్షలు కూడా జరగని దుస్థితి తూర్పుగోదావరి జిల్లా విద్యా శిక్షణా కేంద్రాల్లో చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 72 వేల మంది విద్యార్థులు మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించలేదు. రాష్ట్ర ప్రభుత్వం వీరి భవిష్యత్తును గాలికొదిలేసిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఏటికేడాది ఈ అభ్యర్థులను భర్తీ చేయడమే కానీ వీరికి సక్రమంగా పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల విలువైన భవిష్యత్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఫణంగా పెట్టాల్సి వస్తోంది. 2015-17 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులకు ఇప్పటి వరకు మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు నిర్వహించలేదు. ఈ బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు 2014 మార్చిలో జరిగిన ప్రవేశ పరీక్ష ద్వారా ర్యాంకులు సాధించి రాష్ట్రంలోని వివిధ కాలేజీల్లో చేరారు. ఈ బ్యాచ్‌కు ఈ ఏడాది సెప్టెంబర్‌తో రెండేళ్ల కోర్సు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ ఇంకా మొదటి ఏడాది వార్షిక పరీక్షలే పూర్తి కాలేదని విద్యార్థులు తల్లడిల్లుతున్నారు. రాష్ట్రంలోని దాదాపు 600 డిఇడి కాలేజీల్లో దాదాపు 72వేల మంది స్కూలు అసిస్టెంట్ల విద్యా శిక్షణ పొందుతున్నారు. ఉదాహరణకు తూర్పు గోదావరి జిల్లాలో 60 ప్రైవేటు విద్యా శిక్షణా కాలేజీలుండగా బొమ్మూరులో ప్రభుత్వ విద్యా శిక్షణా కేంద్రం ఉంది. ఈ కేంద్రంలో 200 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ఇంటర్ విద్యార్హతతో స్కూలు అసిస్టెంట్ టీచర్ పోస్టులకు అభ్యర్థులు కామన్ ఎంట్రన్స్ రాసి ర్యాంకుల ద్వారా ఈ శిక్షణా కాలేజిల్లో సీట్లు పొందుతారు. రెండేళ్ల శిక్షణ అనంతరం సర్ట్ఫికెట్లతో స్కూలు అసిస్టెంట్ల నియామకాల కోసం బయటకు వస్తారు. ఎన్టీ ఆర్ 1984లో స్థాపించిన ఈ శిక్షణా కేంద్రాలను రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉండగా జిల్లాకొక ప్రభుత్వ విద్యా శిక్షణా కేంద్రాలుగా ఉన్నతీకరించారు. ఒక వైపు పరీక్షలు లేకపోవడం ఒక ఎత్తయితే సిలబస్ కూడా పూర్తి కాలేదు. దీనికి తోడు ఈ బ్యాచ్ నుంచే కొత్త సిలబస్ అమల్లోకి వచ్చింది. అరకొర సిబ్బంది పూర్తి స్థాయిలో సిలబస్‌ను పూర్తి చేయలేని దుస్థితిలో ఈ కాలేజీలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఇది చాలదన్నట్టు గత సెప్టెంబర్ వరకు అకాడమీ పుస్తకాలు విద్యార్థులకు అందలేదు. ఉదాహరణకు రాజమహేంద్రవరం బొమ్మూరు డిఎడ్ కాలేజిలో ప్రిన్సిపాల్‌తోపాటు 26 మంది అధ్యాపక సిబ్బంది వుండాల్సి ఉండగా కేవలం ఆరుగురే ఉన్నారంటే సిబ్బంది కొరత ఏ స్థాయిలో వుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక అధ్యాపకేతర సిబ్బంది విషయానికొస్తే 26 మందికిగాను కేవలం 10 మందే ఉన్నారు. వాచ్‌మెన్, స్వీపర్, అటెండర్ అన్ని పోస్టులు ఒకరే అన్నట్టుగా సరిపెట్టుకుంటున్నారు. బడ్జెట్ అరకొరగా ఉండటంతో ఇంకా స్కాలర్ షిప్‌లు కూడా అందలేదు. దీంతో విద్యార్థులు స్టూడెంట్ హాస్టళ్లల్లో ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో పరీక్షలు పూర్తి కాకపోవడం వల్ల హాస్టళ్ళ ఫీజులు పెరిగిపోయి తల్లిదండ్రులు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏదేమైనప్పటికీ నిలిచిపోయిన ఈ పరీక్షలను సక్రమంగా నిర్వహించి విద్యా సంవత్సరం వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.