రాష్ట్రీయం

తిరుమలేశునికి భారీ కానుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 18: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి రూ. 16లక్షల విలువైన ధర్మవరం పట్టు పంచె, ఉత్తరీయంను పులివెందులకు చెందిన రామానుజుల రెడ్డి, ఆయన సతీమణి వెంకట సుజాత అనే భక్తులు శనివారం కానుకగా అందించారు. తిరుపతిలోని మాధవం విశ్రాంతి గృహంలో టిటిడి ధర్మకర్తల మండలి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తిని కలసి ఈ కానుకను అందించారు. ఈ పట్టుపంచె, ఉత్తరీయం తయారీలో ఎక్కువమందిని భాగస్వామ్యం చేయడంతో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం లభించినట్లు ఆసంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈమేరకు ధ్రువీకరణ పత్రాన్ని రాఘవేంద్ర గ్రూపునకు అందించినట్లు తెలిపారు. శ్రీవారికి కానుకగా ఇచ్చిన పట్టుపంచె, ఉత్తరీయం తయారీలో కిలో మేర వెండి, బంగారును వినియోగించారు. ధర్మవరానికి చెందిని రాఘవేంద్ర గ్రూప్ మగ్గం పనివారు వీటిని తయారుచేశారు. ఈపట్టుపంచె ఉత్తరీయం తయారీలో మొబైల్ మగ్గం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో పర్యటించి, 60వేల మంది భక్తులను భాగస్వామ్యం చేశారు. ఈపట్టుపంచె, ఉత్తరీయంలో ‘ఓం నమో వేంకటేశాయ’ అనే మంత్రంతో లక్షకుపైగా నామాలను పొందుపరిచారు. మొబైల్ మగ్గం నేతపనిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారని రామానుజుల రెడ్డి తెలిపారు.

చిత్రం...స్వామివారికి కానుకలు సమర్పిస్తున్న రామాంజులు రెడ్డి