తెలంగాణ

నేడు కాంగ్రెస్ ‘జన ఆవేదన’ సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఫిబ్రవరి 18: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రధాన ప్రతిపక్షమైన కాం గ్రెస్ పార్టీ ‘జన ఆవేదన సమ్మేళనం’ పేరుతో భారీ బహిరంగ సభలకు సన్నద్ధమైంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ సభలను నిర్వహించాలని ప్రణాళికలు రూపొందించుకుని, మొట్టమొదటగా నిజామాబాద్ జిల్లా నుండి శ్రీకారం చుడుతున్నారు. స్థానిక కలెక్టరేట్ మైదానంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జన ఆవేదన సభ ప్రారంభం కానుండగా, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఆయనతో పాటు ఎఐసిసి నేత కొప్పుల రాజు, టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సిఎల్పీ నేత జానారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్‌అలీ, సురేష్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, మధుయాష్కీ తదితరులు పాల్గొననున్నారు. తెలంగాణ ఏర్పాటు చేసినప్పటికీ, పార్టీని అధికారంలోకి తేలేకపోయామని అంతర్మథనం చెందుతున్న టి.పిసిసి నేతలంతా జన ఆవేదన సభలను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని అమలు చేయడం వల్ల సాధారణ ప్రజానీకానికి తలెత్తిన ఇబ్బందుల గురించి ప్రస్తావిస్తూనే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందిన అంశాలను ఈ సభలో స్పృశించనున్నారని తెలుస్తోంది. ఇది ఎంతమాత్రం రాజకీయ సభ కాదని, యుపిఎ, తెరాస పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి ఆవేదనను ఆవిష్కరింపజేసేందుకే జన ఆవేదన సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నప్పటికీ, పాలకపక్షాల వైఫల్యాలను చాటుతూ ప్రజలను తమ పార్టీ వైపు మళ్లించి వచ్చే ఎన్నికల నాటికి పూర్వ వైభవాన్ని సమకూర్చుకోవాలనే తపన కాంగ్రెస్ శ్రేణుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో మొట్టమొదటి జన ఆవేదన సభ కావడంతో మరింత ప్రాధాన్యత ఇస్తున్నారు.
భారీ జన సమీకరణ కోసం ఈ కార్యక్రమం ఖరారైన మరుక్షణం నుండి జిల్లా ముఖ్య నేత లు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, మాజీ స్పీకర్ కెఆర్.సురేష్‌రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్సీ ఆకుల లలిత, మహేష్‌కుమార్ గౌడ్, తాహెర్‌బిన్ హందాన్, గడుగు గంగాధర్, రత్నాకర్, అరుణతార తదితరులంతా వారం రోజుల నుండి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తూ సభకు పెద్దఎత్తున ప్రజలను తరలించాలని పార్టీ శ్రేణులకు బాధ్యతలు అప్పగించారు.
కాంగ్రెస్‌తో పాటు అనుబంధ సంఘాల నేతలంతా జన ఆవేదన సభను విజయవంతం చేసేందుకు విస్తృత ప్రచారంలో నిమగ్నమై కనిపించారు. ప్రత్యేక రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన తర్వాత దాదాపు రెండున్నరేళ్ల అనంతరం భారీ స్థాయిలో నిర్వహిస్తున్న సభ కావడం, ఎఐసిసి, టి.పిసిసి ముఖ్య నేతలు హాజరవుతుండడంతో ఏ చిన్న లోటుపాట్లకు సైతం తావు లేకుండా ఆయా విభాగాలకు ప్రత్యేకంగా కమిటీలను ఖరారు చేసుకుని తుది ఏర్పాట్లను చక్కబెట్టే యత్నాల్లో నిమగ్నమయ్యారు. ఈ సభను విజయవంతం చేయడం ద్వారా పాలకపక్షాల వైఫల్యాలను ఎండగట్టడమే కాకుండా, పార్టీ కార్యకర్తల్లో నెలకొని ఉన్న నైరాశ్యాన్ని పారద్రోలి వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించవచ్చని కాంగ్రెస్ ముఖ్య నేతలు ఆశాభావంతో ఉన్నారు. తొలి సభ పూర్తిస్థాయిలో విజయవంతమైతే, దీనిని స్ఫూర్తిగా తీసుకుని మరింత రెట్టించిన ఉత్సాహంతో మిగతా అన్ని ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో జన ఆవేదన సభలను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించవచ్చని భావిస్తున్నారు.

సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న కాంగ్రెస్ నాయకులు