రాష్ట్రీయం

దేవ దేవేరులకు హంస వాహనసేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, ఫిబ్రవరి 19 : ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో

జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో

భాగంగా మూడవ రోజైన ఆదివారం భ్రమరాంబ

మల్లికార్జున స్వామివార్లకు హంస వాహన సేవ

నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చక వేద

పండితులు స్వామి అమ్మవార్లకు విశేష

పూజాధికాలు, చండీశ్వరునికి ప్రత్యేక పూజలు,

లోకకల్యాణం కోసం జపాలు శాస్త్రోక్తంగా చేశారు.

సాయంత్రం ప్రదోష కాల పూజలు, హోమాలు

జరిపించి జపానుష్టాలు నిర్వహించారు. అలాగే

స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను

అక్కమహాదేవి అలంకరణ మండపంలో ప్రత్యేకంగా

అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం

స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వేద

మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ

ఆలయ పురవీధుల్లో ఎంతో వైభవంగా గ్రామోత్సవం

నిర్వహించారు.

హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన పార్వతీ

పరమేశ్వరులు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు
కాళహస్తిలో అంకురార్పణ

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 19: మహాశివరాత్రి

బ్రహ్మోత్సవాల అంకురార్పణ సందర్భంగా

ఆదివారం మధ్యాహ్నం శ్రీకాళహస్తిలో కన్నప్ప

ధ్వజారోహణం వేడుకగా జరిగింది. ఆలయం నుంచి

కన్నప్ప ఉత్సవమూర్తిని మేళతాళాలతో కొండపై

ఉన్న కన్నప్ప ఆలయానికి తీసుకెళ్లి అర్చకులు

పూజలు నిర్వహించారు. ఆ తరువాత

ధ్వజస్తంభానికి పూజలు చేసి అలంకారం

నిర్వహించారు. దీంతో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు

అంకురార్పణ జరిగినట్లయింది. ప్రతియేటా

బ్రహ్మోత్సవాలకు ముందు భక్తుడైన కన్నప్పకు

మొదట పూజ చేయడం ఆనవాయితీగా ఉంది.

మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం

శ్రీకాళహస్తిలో స్వామివారి ధ్వజారోహణం

జరుగనుంది. ఈ ఉత్సవాన్ని దేవరాత్రి అంటారు.

అమృతాన్ని తీసుకురావడానికి పాల సముద్రాన్ని

చిలికే సందర్భంగా దేవతలు పరమశివుడిని

పూజించే ఉత్సవానే్న దేవరాత్రి అంటారు.

పంచభూతలింగాల్లో శ్రీకాళహస్తి వాయుక్షేత్రంగా

ఉంది. ప్రాణవాయువు ఆకారంలో శివుడు కొలువై

ఉన్నాడు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల

తరువాత స్వామివారి ధ్వజారోహణం జరుగనుంది.

ఈ సందర్భంగా వెండి అంబారీ వాహనాల సేవ

జరుగుతుంది.