రాష్ట్రీయం

దళిత బాట పడదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 20: మత మార్పిడులను నిరోధించడానికి మఠాధిపతులు, పీఠాధిపతులు, ధార్మిక సంస్థలు, దళితుల దరి చేరి హైందవ సనాతన ధర్మం గొప్పతనంపై చైతన్యం తీసుకురావడం ఒక్కటే మార్గమని కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఉద్బోధించారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో సోమవారం రాష్ట్ర దేవాదాయశాఖ అనుబంధ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ అధ్యక్షుడు పివిఆర్‌కె ప్రసాద్ నేతృత్వంలో టిటిడి సహకారంతో జరిగిన ధార్మిక సదస్సులో పాల్గొన్న పలువురు మఠ, పీఠాధిపతులు హైందవ ధర్మ పరిరక్షణకు, మత మార్పిడుల నిరోధానికి చేపట్టాల్సిన అంశాలపై ఏకవాక్య మార్గాన్ని ప్రబోధించారు. దళితవాడల వనవాసాల స్థానాలకు స్వయంగా మఠ, పీఠాధిపతులు ధార్మిక పరిరక్షకులు వెళ్ళి హైందవ ధర్మ పరిరక్షణ గొప్పతనాన్ని చాటితే ఎంతమంది అన్యమతస్తులు ప్రలోభ పరచినా పరమతాలవైపు కనె్నత్తి చూడరని స్పష్టం చేశారు. శివస్వామి మాట్లాడుతూ తమ పీఠం తరపున దళితవాడల్లో 155 దేవాలయాలను నిర్మించామని చెప్పారు. టిటిడి సంస్థలో అన్యమతస్తులు పనిచేస్తూ హైందవులు స్వామివారిపై ఉన్న అపార భక్తి విశ్వాసాలతో సమర్పిస్తున్న కానుకలతో జీతాలు పొందుతున్నారని అలాంటి వారిలో కూడా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. శంకరానంద స్వామి మాట్లాడుతూ ధార్మిక సంస్థలో భక్తులు సమర్పిస్తున్న నిధులు సక్రమ మార్గంలో వినియోగమయ్యేలా నిఘా వ్యవస్థను అభివృద్ధి చేయాలన్నారు. గౌడ మఠం పీఠాధిపతి మునిమహరాజ్ మాట్లాడుతూ హైందవ ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోకపోవడం వల్లే అన్యమతస్తుల ప్రలోభాలకు గురవుతున్నారని, అలాంటి వారిని హైందవ ధర్మం పట్ల చైతన్య పరచాలని అన్నారు. పుష్పగిరి మఠం పీఠాధిపతి విద్యాశంకర భారతి మాట్లాడుతూ తమ మఠం చేపడుతున్న హైందవ ధర్మ పరిరక్షణ గురించి తెలిపారు. శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి మాట్లాడుతూ తాత్కాలిక అవసరాలకు లోబడి వందల మంది అన్యమతాల వైపు మొగ్గు చూపుతున్నారని అలాంటి వారి అవసరాలు తీర్చాల్సిన బాధ్యత హైందవ ధర్మ పరిరక్షకులపై ఉందన్నారు. ప్రైవేట్ వ్యక్తులు సక్రమంగా నిర్వహించలేని దేవాలయాలను గుర్తించి దేవాదాయ శాఖ, టిటిడి ఆర్థిక సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. హిందూ దర్శిని అనే కార్యక్రమం ఏర్పాటు చేసి హైందవ సంస్థలు చేపడుతున్న సేవ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. చిన్మయానంద స్వామి మాట్లాడుతూ యువతను హైందవ ధార్మిక కార్యక్రమాలవైపు ప్రోత్సహించాలన్నారు. విశ్వంజీ మహరాజ్ మాట్లాడుతూ రాజకీయం, సినిమాల వైపు వెడుతున్న సమాజాన్ని ధార్మిక చింతనవైపు మళ్ళించే మార్గాలను అనే్వషించాలన్నారు. కమలానంద భారతీ స్వామి మాట్లాడుతూ హైందవ ఆచార వ్యవహారాలు, హైందవ ధర్మ మహత్యాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. సత్యానంద భారతీ, రంగనాథ మహాదేశికర్ , త్రిదండి రామానుజ జియ్యర్ మాట్లాడుతూ ధర్మ పరిరక్షణలో ప్రభుత్వాల భాగస్వామ్యం మరింత పెరగాలన్నారు. చతుర్వేద స్వామి మాట్లాడుతూ ముక్కోటి దేవతలకు నిలయంగావున్న గోమాత సంరక్షణ, గోవధ నిషేధంపై ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. అహోబిల రామానుజ జియ్యర్ మాట్లాడుతూ హైంధవ పరిరక్షణకు లీగల్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. దేశంలోని ప్రధాన హైందవ దేవాలయాలు ఒక్కో జిల్లాను దత్తత తీసుకుని ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉందన్నారు. ఆర్ష విద్యాపీఠం పీఠాధిపతి ప్రణవాత్మకానంద సరస్వతి మాట్లాడుతూ పీఠాధిపతులు పరమత ప్రచారం జరగకుండా దళితవాడల్లో ప్రవాసం చేయాలన్నారు. శుక బ్రహ్మాశ్రమం పీఠాధిపతి విద్యాప్రకాశానందగిరి మాట్లాడుతూ సనాతన భారతీయతను బోధించే అంశాలను విద్యార్థి దశ నుంచే బోధించేలా పాఠ్యాంశాలను తయారు చేయాలన్నారు. ప్రతి ఇంటికి ధర్మప్రచార సాహిత్యాలను అందించాలన్నారు. సత్యాత్మ తీర్థస్వామిజీ మాట్లాడుతూ గ్రామాలను మఠ,పీఠాధిపతులు దత్తత తీసుకుని ధర్మప్రచారం చేయాలన్నారు. మంత్రాలయ సుబుదేంద్రతీర్థ స్వామిజీ మాట్లాడుతూ ప్రతి హైందవ దేవాలయంలో గోపూజ నిర్వహించాలన్నారు. శ్రీశక్తి పీఠం మాత రమ్యయోగిని మాట్లాడుతూ ధర్మానికి ప్రతీకలైన మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలన్నారు. ఆచార వ్యవహారాలను సరళీకృతం చేయాలన్నారు. స్వామి విరజానంద మాట్లాడుతూ ఆపదలు ఎదురైనప్పడు స్వామీజీలే రక్షణ కల్పించాలన్నారు. అష్టలక్ష్మీ పీఠం పీఠాధిపతి దండిస్వామి మాట్లాడుతూ ఇతర మతస్థుల చర్యలను ఖండించే విధంగా ఎప్పటికప్పుడు చర్చా గోష్టులు జరగాలన్నారు.

చిత్రం..తిరుమలలో జరిగిన 4వ సనాతన ధార్మిక సదస్సులో మాట్లాడుతున్న కంచి కామకోటి పీఠాధిపతి. వేదికపై ఆసీనులైన వివిధ మఠాల, పీఠాల అధిపతులు