రాష్ట్రీయం

నేడు తిరుమలకు కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: తిరుమల వెంకటేశ్వర స్వామి, తిరుచానూరు పద్మావతి అమ్మవారికి మొక్కులు చెల్లించడానికి సిఎం కె చంద్రశేఖర్‌రావు కుటుంబీకులు, కొందరు మంత్రులతో కలిసి మంగళవారం ప్రత్యేక విమానంలో తిరుపతి వెళ్తున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే తిరమల వెంకన్నకు స్వర్ణ్భారణాలు సమర్పిస్తానని మొక్కుకున్నట్టు కెసిఆర్ గతంలోనే ప్రకటించారు. ‘తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎక్కని మెట్లు లేవు. మొక్కని దేవుడు లేడు’ అని ఉద్యమ సమయంలో కెసిఆర్ పలు సందర్భాల్లో అనేవారు. ఆ మేరకే తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలి మంత్రివర్గ సమావేశంలో మొక్కుల వివరాలను సిఎం వెల్లడించారు. తిరుపతి వెంకన్నతోపాటు విజయవాడ కనుకదుర్గ అమ్మవారికి కిరీటం, వరంగల్ భద్రకాళి అమ్మవారికి కిరీటం, కురవి వీరభద్రునికి మీసాలు మొక్కులుగా చెల్లించనున్నట్టు సిఎం ప్రకటించారు. ఏడాదికిందటే తిరుపతికి వెళ్లి మొక్కులు చెల్లించాలని సిఎం భావించారు. అయితే కార్యక్రమం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ ఎట్టకేలకు మంగళవారం ముహూర్తం కుదిరింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున తిరుమల వెంకన్నకు సమర్పించడానికి రూ.5.59 కోట్ల విలువ చేసే స్వర్ణ్భారణాలు తయారు చేయించే బాధ్యతను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టిటిడి)కు ఏడాది కిందటనే చెల్లించింది. అభరణాలు తయారీ పనిని తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ప్రముఖ నగల తయారీ దుకాణానికి టిటిడి అప్పగించింది. కోయంబత్తూరులో తయారు చేసిన అభరణాలలో వెంకటేశ్వరస్వామికి కంఠాభరణం, సాలగ్రామహారం, పద్మావతి అమ్మవారికి ముక్కుపుడక ఉన్నాయి.
ప్రత్యేక విమానంలో...
సిఎం కెసిఆర్ తన కుటుంబీకులు, కొందరు మంత్రులతో కలిసి మంగళవారం సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు రేణిగుంటకు చేరుకుంటారు. అక్కడినుంచి కొండపైకి వెళ్లి ఆ రాత్రి అక్కడే బస చేస్తారు. బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకొని మొక్కులు సమర్పిస్తారు. తర్వాత కొండపై ఉదయం 10.30కు జరుగనున్న తెలంగాణ పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి వివాహానికి హాజరవుతారు. తర్వాత 11.30కు బయలుదేరి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకొని ముక్కుపుడక సమర్పిస్తారు. అక్కడి నుంచి ఒంటిగంటకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని తిరిగి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వస్తారు. సిఎం దంపతుల వెంట కుమారుడు, మంత్రి కెటిఆర్, కూతురు ఎంపి కవిత, అల్లుడు మంత్రి టి హరశ్‌రావు కుటుంబీకులు, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటల రాజేందర్, పద్మారావుగౌడ్ తిరుమలకు వెళ్లనున్నారు. ఇలాఉండగా సిఎం తిరుపతి పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు గతంలో టిటిడి బోర్డు చైర్మన్‌గా పనిచేసిన ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, దేవాదాయశాఖ కమిషనర్ ఎన్ శివశంకర్ సోమవారం తిరుపతికి బయలుదేరి వెళ్లారు.